ఎవడు సినిమా ఇంకొంత కాలం ల్యాబుల్లోనే మూలగాలని రాసి పెట్టుంది. జులై 31న రావల్సిన ఈ సినిమా ఎప్పుడైతే వాయిదా పడిరదో… అప్పటి నుంచీ ఈ సినిమాకి బైడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఆగస్ట్, సెప్టెంబరు, అక్టోబరు.. ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. చివరికి నవంబరు మూడో వారంలో విడుదల చేద్దామనుకొన్నారు.
అయితే ఆ తేదీన కూడా ఎవడు విడుదలయ్యే ఛాన్సులు చాలా తక్కువని ఫిల్మ్‌నగర్ టాక్. నవంబరు – డిసెంబరు సినిమాలకు గడ్డుకాలం. అన్ సీజన్. ఆ సమయంలో ఎంత మంచి సినిమా బయటకు వచ్చినా.. బోల్తా పడడం ఖాయమే అనే సెంటిమెంట్ ఉంది. అందుకే దిల్ రాజు ఈ రిస్క్‌ని తీసుకోవడం లేదట.
ఏకంగా ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తే ఎలా ఉంటుంది? అంటూ పునరాలోచనలో పడ్డాడు దిల్ రాజు. మరోవైపు సంక్రాంతికి బారీ సినిమాలే వస్తున్నాయి. వన్, రేసుగుర్రం, హార్ట్ ఎటాక్ రాబోతున్నాయి. వన్ మాత్రం గ్యారెంటీ. మిగతా రెండు సినిమాల డేట్లు నిర్థారణ చేసుకొని.. ఎవడు సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాడట. పాపం.. చరణ్ సినిమాకి ఎన్నికష్టాలచ్చాయో..?