అత్తారింటికి దారేది సినిమాతో పవన్ కల్యాణ్ మరో పది మెట్టు ఎక్కాడు. ఆ తరవాత వచ్చే సినిమా అంటే ఎన్నో అంచనాలు. అవన్నీ అందుకోవాలి కదా..? అందుకే గబ్బర్ సింగ్ 2 విషయంలో పవన్ కల్యాణ్ చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. పూర్తి బాధ్యత సంపత్‌నందిపై పెట్టకుండా.. స్క్రిప్టు విషయంలో తాను పూర్తిగా జోక్యం చేసుకొంటున్నాడట.
గోవాలో పవన్ ఆధ్వర్యంలో స్క్రిప్టు పనులుకూడా జరిగాయి. ఈ సినిమా త్రివిక్రమ్ సంభాషణలు అందిస్తాడనే ప్రచారం జరిగింది. కానీ త్రివిక్రమ్ అందుకు ఆసక్తి చూపించలేదు. అందుకే… ఇప్పుడు పవన్ ఆ బాధ్యతను నెత్తిమీద వేసుకొన్నాడట. అన్నీ కాదు కానీ, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను పూర్తిగా మార్చి వేసి – తన స్టైల్‌లో రాసుకొన్నాడట. అందులో సంభాషణలూ పవన్‌వే.
ఈ సినిమాకి పవన్ కథ, స్క్రీన్‌ప్లే అందించాడు. మాటల కార్డూ పవనే వేసుకొంటాడేమో..? ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ అన్నీ తానై అయిన పవన్… ఈ సినిమాని ఏ తీరానికి చేరుస్తాడో చూడాలి.