ఫీల్ మై లవ్… అంటూ ప్రేమ పూలు కురిపించిన చిత్రం ఆర్య. ఈ సినిమా యూత్‌ని విశేషంగా ఆకట్టుకొంది. సుకుమార్ మార్క్ తొలి సినిమాతో గట్టిగా పడిపోయింది. కొనసాగింపుగా వచ్చిన ఆర్య 2 మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.
కానీ ఈ సినిమాని బాలీవుడ్లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కథ హిందీ జనాలకు అయితే బాగా ఎక్కుతుందని అక్కడి నిర్మాతలు భావిస్తున్నారట. అందుకే సుకుమార్‌ని ఎప్రోచ్ అవుతున్నట్టు సమాచారమ్.
ప్రభుదేవా సినిమా రామయ్యా వస్తావయ్యాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తురానీ ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తాడని సమాచారమ్. మన హిట్టు సినిమాలకే కాదు.. ఫ్లాపులకూ బాలీవుడ్లో మంచి రోజులచ్చాయన్నమాట.