గబ్బర్ సింగ్ 2కి త్రివిక్రమ్ మాట సాయం చేస్తున్నాడా..? గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో ఇదే ప్రశ్న. సంపత్ నందితో రైటింగ్ స్టైల్‌కి సంతృప్తి చెందని పవన్ కల్యాణ్.. తన స్నేహితుడు త్రివిక్రమ్‌తో ఈ సినిమాకి మాటలు రాయిస్తున్నాడని, కొన్ని సన్నివేశాలను కూడా పూర్తిగా మార్చాడనే టాక్ నడుస్తోంది. అయితే పవన్ అభ్యర్థనను త్రివిక్రమ్ సున్నితంగా తిరస్కరించాడట.
తరువాతి సినిమా బిజీలో పడిపోవడం వల్ల.. త్రివిక్రమ్ ఈ బాధ్యతను భుజాన వేసుకోవడానికి సముఖత చూపించడం లేదట. దాంతో సంపత్ రాసిన డైలాగులనే యధాతథంగా ఉంచేస్తున్నాడు పవన్. గబ్బర్ లో త్రివిక్రమ్ హ్యాండు కలిస్తే.. ఇంకాస్త క్రేజ్ వస్తుందని ఆశించిన అభిమానులకు ఇది చేదువార్తే. సంపత్ మాటలతో సర్దుకుపోవాలిక.