సినిమా యాభై రోజులు ఆడిన తరవాత… మళ్లీ రిపీటెడ్ ఆడియన్స్‌కి థియేటర్ కి రప్పించడానికి ఓ ట్రిక్కు కనిపెట్టారు తెలుగు సినిమావాళ్లు. ఎడిట్ రూమ్‌లో కత్తిరించిన కొన్ని సన్నివేశాల్ని అతికించి వదలడం.
మిర్చి సినిమా 50 రోజుల తరవాత వాన ఫైటు ఒకటి యాడ్ చేశారు. దాంతో ఆ సినిమాకి ఇంకాస్త మైలేజీ వచ్చింది. ఇప్పుడు అత్తారింటికి దారేది సినిమాకీ అదే సీను. ఈ సినిమా 25 రోజులు పూర్తి చేసుకొంది. ఇప్పుడీ సినిమాలో కొత్త సీన్లు కలుస్తున్నాయి.
సెకండాఫ్ లో కత్తిరించిన బ్రహ్మానందం సీన్‌ని మళ్లీ అతికిస్తున్నారట. ఆ సీన్ దాదాపు ఏడు నిమిషాలుంటుందని టాక్. 30వ రోజుత తరవాత ఈ సీన్ యాడ్ చేస్తారట. వంద కోట్ల వైపుగా అత్తారింటిని లాగాలంటే… ఇలాంటి ట్రిక్కులు తప్పవు.