కాజల్‌ ప్రేమలో పడిందా?

కాజల్‌ అగర్వాల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌ ప్రేమ విషయం బయట పడడంతో, ఆమె పెళ్లి కూడా త్వరలోనే అని తెలియడంతో, ఫోకస్‌ కాజల్‌ మీదకి మళ్లింది. చెల్లి పెళ్లి చేసేసుకుంటోంది కాబట్టి కాజల్‌ కూడా…

కాజల్‌ అగర్వాల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌ ప్రేమ విషయం బయట పడడంతో, ఆమె పెళ్లి కూడా త్వరలోనే అని తెలియడంతో, ఫోకస్‌ కాజల్‌ మీదకి మళ్లింది. చెల్లి పెళ్లి చేసేసుకుంటోంది కాబట్టి కాజల్‌ కూడా పెళ్లికి తొందర పడుతుందేమో అని మీడియాలో గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. అయితే కాజల్‌ మాత్రం తనకి ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని చెప్పింది. 

ఇంతవరకు తానెవరినీ ప్రేమించలేదని, ప్రస్తుతానికి సింగిల్‌గా ఉన్నానని, ఇంకా చాలా కాలం నటించాలని అనుకుంటున్నానని కాజల్‌ తెలియజేసింది. మిగిలిన హీరోయిన్లకి అఫైర్స్‌ ఉన్నాయనే రూమర్స్‌ వస్తుంటాయి కానీ తన గురించి ఎందుకు రావనే దానికి వివరణ ఇస్తూ.. తానెప్పుడూ పని మీద తప్ప ఇక దేని మీదా ధ్యాస పెట్టనని చెప్పింది. 

‘షూటింగ్‌కి వచ్చానంటే ఎంతసేపు దాని మీదే శ్రద్ధ పెడతాను. ఒక్కసారి ప్యాకప్‌ చెప్పగానే ఇక ఎవరితోను మాట్లాడకుండా ఇంటికో లేదా హోటల్‌ రూమ్‌కో వెళ్లిపోతాను. మళ్లీ షూటింగ్‌ స్పాట్‌లో తప్ప బయట ఎక్కడా కనిపించను. ఇలాంటి లైఫ్‌ స్టయిల్‌ ఉన్నవారి గురించి గాసిప్స్‌ వచ్చే అవకాశం లేదు’ అంటూ కాజల్‌ తన జీవనశైలి గురించి వివరించింది.