భరత్ అనే నేను ఇప్పుడు తాజా డిస్కషన్ పాయింట్. స్పైడర్ అయిపోయింది. అజ్ఞాతవాసి అయిపోయింది. ఇక భరత్ అనే నేను, రంగస్థలం, నా పేరు సూర్య వున్నాయి. వీటిలో రంగస్థలం, నా పేరు సూర్య బిజినెస్ లు చాలా వరకు ఫినిష్ చేసారు. భరత్ అనే నేను బిజినెస్ వుంది. కొరటాల శివ క్రేజ్ ఆ సినిమాకు అండగా వుంది.
అందుకే టోటల్ డిజిటల్, శాటిలైడ్, ఆడియో, ఆల్ లాంగ్వేజెస్ కలిసి భారీ ఆఫర్ ఆ సినిమాకు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు హిందీ డబ్బింగ్, అదర్ రైట్స్ అన్నీ కలిపి స్టార్ మా చానెల్ ఏకంగా 39కోట్ల ఆఫర్ ఇచ్చిందని గ్యాసిప్ గుప్పుమంది.
ఇప్పటి వరకు ఈ విషయంలో రంగస్థలం, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య కూడా మంచి ఫిగర్లే నమోదు చేసాయి. కానీ ముఫైలు దాటిన దాఖలా లేదు. ఇప్పుడు మహేష్-కొరటాల శివ సినిమా ఆ రికార్డు బద్దలు కొట్టేలా వుంది.
అమెజాన్ రంగ ప్రవేశం చేసాక, డిజిటల్ రైట్స్ బాగా పెరిగాయి. మీడియం సినిమాలే ఓన్లీ డిజిటల్ రైట్స్ గా రెండు, మూడు కోట్లు చేసుకుంటున్నాయి. ఇటీవల ముంబాయ్ కంపెనీలు, మన దగ్గర వున్న డిజిటల్ కంపెనీలు కూడా ముందుగా రైట్స్ కు అగ్రిమెంట్ చేసుకుని, మళ్లీ అమ్మడం కామన్ అయింది.
అందువల్ల మహేష్ సినిమాకు రావడంలో ఆశ్చర్యం లేదు. స్పైడర్ సినిమాకు కూడా మంచి రేటే వచ్చింది. ఇప్పుడు వినిపిస్తున్న ఫిగర్ నిర్మాత దానయ్య కోట్ చేసిందా? లేక స్టార్ మా ఆఫర్ చేసిందా అన్నది తెలియాల్సి వుంది.