మారుతి-నాగ చైతన్య సినిమా శైలజారెడ్డి అల్లుడు సెట్ మీదకు వెళ్తోంది. 19నుంచి షూట్ స్టార్ట్ అవుతోంది. హారిక హాసిని సంస్థకు చెందిన రెండో బ్యానర్ సితార ఎంటర్ టైన్స్ మెంట్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
మొదట్నించీ ఈ సినిమా సబ్జెక్ట్ ఒకటే మాట వినిపిస్తోంది. ఆఫ్టర్ మ్యారేజ్ ఇగో సమస్యలు కీలకంగా సినిమా వుంటుందని. అయితే మరి అవి గ్యాసిప్ లేనా, లేదా స్క్రిప్ట్ లో ఛేంజెస్ జరిగాయా? మొత్తానికి సినిమా చాలా వరకు లవ్ స్టోరీనే వుంటుదని తెలుస్తోంది.
షూటింగ్ స్టార్ట్ కావడమే కాలేజీ బ్యాక్ డ్రాప్ లో స్టార్ట్ చేస్తున్నారు. కోటీ ఉమెన్స్ కాలేజీలో చైతూ-అను-వెన్నెలకిషొర్ లు పాల్గొనే కొన్ని సీన్లతో షూట్ స్టార్ట్ చేస్తున్నారట. ఈ సినిమాలో అను క్యారెక్టర్ ఫుల్ ఏరోగెంట్ గా వుంటుందట. అందువల్ల వచ్చే సమస్యలు కీలకంగా వుంటాయన్నమాట.
అత్తగారి ఏరోగెన్సీ, దానికి తగినట్లే కూతురు పొగరుగా వుండడం అన్నది మన సినిమాలకు పాత ముడిసరుకే. పైగా ప్రేమికుల మధ్య ఇగోలు అన్నది 100% లవ్ లో చైతూ-తమన్నా చూపించారు. మరి మారుతి ఇప్పుడు కొత్తగా ఏం ప్రెజెంట్ చేయబోతున్నారన్నది ఆసక్తికరం. అత్తగా రమ్యకృష్ణ కనిపించబోతోంది. అందువల్ల బలుపు ప్రధర్శనకు లోటు వుండదు.