ఓవర్ సీస్ లో ఓ మీడియం సినిమాకు నాలుగు కోట్లకు పైగా పెట్టడం అంటే కాస్త భరోసా కావాలి. నాని సినిమాపై అలాంటి భరోసాతోనే కొనేసారు.
నాని-మేర్లపాక గాంధీ కాంబినేషన్ లోని కృష్ణార్జున యుద్ధం సినిమాను మాగ్నస్ మీడియా సంస్థ నాలుగు కోట్లకు పైగా చెల్లించి ఓవర్సీస్ రైట్స్ ను తీసుకుంది. అంటే కచ్చితంగా ఆ సినిమా ఓవర్ సీస్ లో వన్ మిలియన్ కలెక్షన్లు క్రాస్ చేయాలన్నమాట.
మేర్లపాక గాంధీ కామెడీ స్క్రిప్ట్, నాని కామెడీ టైమింగ్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ కలిసి మ్యాజిక్ చేసి, వన్ మిలియన్ మార్కును దాటించేస్తాయన్నది భరోసాగా కనిపిస్తోంది.
అయితే కృష్ణార్జున యుద్ధంలో కొద్దిగా వ్యభిచార గృహాల వ్యవహారాలు లైట్ గా టచ్ చేస్తారని వినిపిస్తోంది. అదంతా లైటర్ వీన్ టోన్ లో వుంటే ఫరవాలేదు. అదే కనుక, డార్క్ షేడ్ చూపిస్తే కష్టం అవుతుంది. అలాంటి సీన్లు ఫ్యామిలీలతో చూడ్డానికి ఓవర్ సీస్ జనాలు అంతగా ఇష్టపడరు.
ఏదైనా మాంచి రేటింగ్, మాంచి రివ్యూలు రావాలి, ఈ రేటుకు వర్కవుట్ కావడానికి.