బన్నీ కెరీర్ లోనే కలెక్షన్ల పరంగా బిగ్గెస్ట్ హిట్ సరైనోడు. కానీ ఆ సినిమా శాటిలైట్ రైట్స్ నామమాత్రపు రేటుకే అమ్ముడుపోయాయి. అయితే సరైనోడు పేరు చెప్పి దువ్వాడ జగన్నాధమ్ శాటిలైట్ ను మాత్రం మంచి రేటుకు అమ్ముకోగలిగాడు నిర్మాత దిల్ రాజు. ఇక తాజాగా తెరకెక్కుతున్న నా పేరు సూర్య సినిమా, ఈ విభాగంలో బన్నీ మార్కెట్ ను ఇంకాస్త పెంచింది.
దువ్వాడ జగన్నాధమ్ శాటిలైట్ రైట్స్ ను 13కోట్ల రూపాయలకు దక్కించుకుంది జీ తెలుగు ఛానెల్. ఇప్పుడు అదే సంస్థ, బన్నీ నటిస్తున్న నా పేరు సూర్య శాటిలైట్ రైట్స్ ను కూడా సొంతం చేసుకుంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. 15కోట్ల రూపాయలకు ఈ సినిమా రైట్స్ అమ్ముడుపోయాయి.
నిజానికి ఈ డీల్ ఇప్పటిది కాదని తెలుస్తోంది. సినిమా ముహూర్తం షాట్ రోజునే ఇటు ఛానెల్ ప్రతినిధులు, అటు మేకర్స్ ఒక మాట అనుకున్నారట. ముహూర్తం రోజునే నిర్మాతలకు టోకెన్ అడ్వాన్స్ కూడా అందిందట. తాజాగా శాటిలైట్ డీల్ అగ్రిమెంట్ మొత్తం పూర్తయింది.
ఈ మధ్యే నా పేరు సూర్య సినిమాకు సంబంధించి ఫస్ట్ ఇంపాక్ట్ పేరుతో టీజర్ రిలీజైంది. మిలట్రీ బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతోంది ఈ సినిమా. అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.