రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్ సినిమాకు స్క్రిప్ట్ వర్కు చురుగ్గా సాగుతోంది. ఎప్పుడైతే ఈ సినిమా వార్త బయటకు వచ్చిందో, అప్పటి నుంచీ బ్రదర్స్, బాక్సింగ్ బ్యాక్ డ్రాప్, అంటూ రకరకాల కథనాలు వినిపించాయి.
కానీ పక్కాగా తెలుస్తున్న విషయం ఏమిటంటే, రాజమౌళి చేస్తున్నది పక్కా ఫ్యామిలీ మూవీ అంట. ఇప్పటి దాకా ఈ జోనర్ ను రాజమౌళి టచ్ చేయలేదనే చెప్పాలి.
లవ్, కాలేజీ, మాస్, యాక్షన్, సోషియో ఫాంటసీ, జానపదం ఇలా అన్నీ టచ్ చేసారు కానీ, పూర్తిగా ఫ్యామిలీ మూవీ చేయలేదు. ఇప్పుడు అదే అటెంప్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా ప్రొడక్షన్ కోసం హీరోలు, ప్లస్ తన పారితోషికం కాకుండా 90కోట్ల బఢ్జెట్ ను రాజమౌళి ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే మరో 60కలపాలేమో? 150కోట్ల సినిమా అంటే తప్పేం కాదు, ఎందుకంటే పవన్ ఒక్కడే వున్న అజ్ఞాతవాసికి 138కోట్ల వరకు అయింది. ఇద్దరు టాప్ హీరోలతో అంటే ఒకెనే. పైగా రాజమౌళి సినిమా మార్కెట్ ఏ రేంజ్ లో వుంటుందో తెలిసిందే.
ఎంత ఫ్యామిలీ మూవీ అయినా, రాజమౌళి ప్రేక్షకుల ఆసక్తి, అభిరుచి, స్థాయి దాటి వెళ్లి పిల్లి మొగ్గలు వేయడు. అందువల్ల భయపడక్కరలేదు కూడా. ఈ సినిమా అక్టోబర్ లో ప్రారంభమై 2019సమ్మర్ నాటికి రెడీ అవుతుంది. 2019సంక్రాంతికి బాహుబలి ప్రభాస్ సాహో, మెగాస్టార్ చిరు సైరా ఢీకొంటాయి. సమ్మర్ లో రామ్ చరణ్-ఎన్టీఆర్ సోలోగా దిగుతారు.