రాజ్ తరుణ్ – మరో తరుణ్?

చూస్తుంటే హీరో రాజ్ తరుణ్ టైమ్ బాగున్నట్లు కనిపించడం లేదు. మాంచి ఎజ్ వుంది. కామెడీ టైమింగ్ వుంది. రంగులరాట్నంలోని సెంటిమెంట్ సీన్లలో చూస్తే సూపర్ గా చేసాడు. అన్నీ బాగానే వున్నాయి. కానీ…

చూస్తుంటే హీరో రాజ్ తరుణ్ టైమ్ బాగున్నట్లు కనిపించడం లేదు. మాంచి ఎజ్ వుంది. కామెడీ టైమింగ్ వుంది. రంగులరాట్నంలోని సెంటిమెంట్ సీన్లలో చూస్తే సూపర్ గా చేసాడు. అన్నీ బాగానే వున్నాయి. కానీ సరైన సినిమా పడి ఎన్నాళ్లయింది? నాని, శర్వానంద్, నిఖిల్ ప్లానింగ్ తో చూసుకుంటే, రాజ్ తరుణ్ ప్లానింగ్ చాలా అమెచ్యూర్ గా కనిపిస్తోంది. చిన్న సినిమా రేంజ్ దాటి నిఖిల్ ఎప్పుడో బయటకు వచ్చాడు. కానీ రాజ్ తరుణ్ ఇంకా ఆ మూడు నాలుగు కోట్ల రేంజ్ సినిమా దగ్గరే స్టక్ అయిపోయినట్లు కనిపిస్తోంది.

ఎకె లో వరుసపెట్టి సినిమాలు చేసాడు. ఫర్వాలేదు అనిపించాయి తప్ప రేంజ్ ను పెంచలేకపోయాయి. ఇంకా అక్కడే మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి పూర్తయింది. మరోటి కొన్నాళ్ల తరువాత చేస్తాడు. ఈ లోగా దిల్ రాజు బ్యానర్ లో లవర్ రెడీ కావాల్సి వుంది. ఆ తరువాత ప్రతాప్ (కుమారి 21 ఎఫ్) డైరక్షన్ లో మరొటి. ఇవి కూడా మీడియం రేంజ్ సినిమాలు అవుతాయా? అన్నది చూడాలి. 

కొత్త లేడీ డైరక్టర్ తో రంగులరాట్నం మీద చాలా హోప్స్ పెట్టుకుంటే అది దారి తప్పి, సెంటిమెంట్ బాటలో పడింది. రాజుగాడు సినిమా కూడా లేడీ డైరక్టర్ నే. అయితే అందుల్లో ఎంటర్ టైన్ మెంట్ పార్ట్ ఎక్కవ. అందువల్ల అది వర్కవుట్ అయ్యే అవకాశం వుంది. వాస్తవానికి ఆ సినిమానే సంక్రాంతికి రావాల్సింది. అన్నపూర్ణ సంస్థ పట్టుపట్టడంతో వెనక్కు తగ్గారు. ఇప్పుడు దానికి సరైన డేట్ లేకుండా పోయింది. ఎప్పుడో గ్యాప్ లో వదిలితే, అది కూడా ఏదో ఆడింది అనిపించేసుకునే ప్రమాదం వుంది.

ఎందుకనో, రాజ్ తరుణ్ ఎక్కడో ప్లానింగ్ లో తేడా కొడుతోంది అనిపిస్తోంది. మిగిలిన వారి కథలు, బ్యానర్ లు, లైనప్ లు రాజ్ తరుణ్ కు ఎందుకో సెట్ కావడం లేదు. నాని,శర్వా, నిఖిల్, నితిన్, ఇలా యంగ్ బ్యాచ్ లో రాజ్ తరుణ్ లాస్ట్ ఛాయిస్ లా కనిపిస్తున్నాడేమో? అందవల్ల సరైన స్క్రిప్ట్ లు, కాంబినేషన్ లు సెట్ కావడం లేదేమో? ఇప్పటికైనా రాజ్ తరుణ్ జాగ్రత్త పడి, తన సినిమాలు, తన సెలక్షన్లు, తన కాంబినేషన్లు సరిగ్గా చూసుకోకుండా, నడుస్తోందిలే అని అనుకుంటే మరో తరుణ్ లా మిగిలిపోయే ప్రమాదం వుంది.