మౌత్ టాక్ + సెకెండ్ వీక్

సంక్రాంతికి బాక్స్ లు బద్దలు కొడతయానుకున్న సినిమాలు ఇంకా తాళాలు తెరిచే పనిలోనే వున్నాయి. పవన్-త్రివిక్రమ్ కాంబో అజ్ఞాతవాసి బాక్స్ బద్దలు కొట్టడం మాట దేవుడెరుగు, అసలు తాళం కూడా తెరవలేక, నీరసపడిపోయింది. Advertisement…

సంక్రాంతికి బాక్స్ లు బద్దలు కొడతయానుకున్న సినిమాలు ఇంకా తాళాలు తెరిచే పనిలోనే వున్నాయి. పవన్-త్రివిక్రమ్ కాంబో అజ్ఞాతవాసి బాక్స్ బద్దలు కొట్టడం మాట దేవుడెరుగు, అసలు తాళం కూడా తెరవలేక, నీరసపడిపోయింది.

ఆ సినిమా లాస్ మేకింగ్ అని క్లియర్ అయిపోయింది. పండగ మూడు రోజులు తర్వాత ఆ సినిమా గురించి ఎక్కువగా హోప్ వుండకపోవచ్చు. అందువల్ల మలి వారం గురించి ఆ సినిమాకు ఆలోచన వుండదేమో?

బాలయ్య బాబు జై సింహా తాళం తెరవగలిగింది కానీ, ఇంకా పెట్టిని తెరిచేంత లేదు. ఇరవై కోట్ల కు దగ్గరగా వుంది షేర్.  నిజానికి ఇధి సరిపోదు. కనీసం ఇంకో పది అన్నా చేయాలి. ఎందుకంటే సినిమాకు ముఫై నుంచి ముఫై అయిదు వరకు ఖర్చయిందని తెలుస్తోంది.

శాటిలైట్ డిజిటల్ పోగా, మరో పాతిక అన్నా రావాలి. రెండోవారం అయిన 19న సినమాలేవీ విడుదల కావడం లేదు. 26వరకు పెద్దగా సినిమాలు ఏవీ ధియేటర్లలో రావడం లేదు. కోస్తాలో సంక్రాంతి అంటే దాదాపు నెలాఖరు వరకు వుంటుంది. కాబట్టి మలివారంపై జై సింహాకు ఆశలు వున్నాయి.

ఇక సూర్య గ్యాంగ్ కు మంచి టాక్ వచ్చింది. నిజానికి అన్ని సినిమాల కన్నా మంచి టాక్ , పాజిటివ్ సమీక్షలు వచ్చింది దీనికే. అయితే సరిగ్గా స్క్రీన్ లు, షో టైమింగ్ లు లేక, కలెక్షన్లు తక్కువగా నమోదు అయ్యాయి.

కానీ విడుదల నాటి నుంచి నాలుగు రోజులు అయింది. డే బై డే అప్ ట్రెండ్ లోనే వెళ్తోంది కలెక్షన్. పస్ట్ డే కన్నా ఫోర్త్ డే కలెక్షన్ డబుల్ అయింది. ఫస్ట్ వీక్ తో అజ్ఞాతవాసి, జై సింహా హడావుడి తేలిపోతే, ఇక గ్యాంగ్ వైపు మళ్లుతారు ఆడియన్స్. అందువల్ల ఈ వీక్ గ్యాంగ్ కలెక్షన్లు బాగుంటాయని అంచనా వేస్తున్నారు. థియేటర్ల రిపోర్టు చూస్తుంటే అలాగే వుంది.

రంగుల రాట్నం చిన్న సినిమా. కానీ పెద్ద ప్లేయర్ అవుతుందనుకున్నారు. అయితే సెంటిమెంట్ ఎక్కువగా తాళింపు పెట్టడంతో కుర్రాళ్లు జీర్ణించుకోవడం కష్టం అవుతోంది.