తెలుగు ఇండస్ట్రీలో దర్శకులకు అడ్వాంటేజ్ అయిన విషయం ఏమిటంటే, దాదాపు యూత్ బ్యాచ్ హీరోలు డజను మందికి పైగానే వున్నారు. ఒకరు కాదంటే, అదే కథ మరొకరితో చేసే అవకాశం వుంటుంది. ఇది ఎన్టీఆర్ కథ, ఏఎన్నార్ కు సూట్ కాదు అని అనుకొవడానికి లేదు. ఇప్పుడు ఒకళ్ల కోసం రాసుకున్న ఏ కథ అయినా, మరొకళ్లకి అడ్జస్ట్ చేసేయవచ్చు.
కృష్ణార్జున యుద్ధం సినిమానే వుంది. మేర్లపాక గాంధీ దర్శకుడు. హలో బ్రదర్స్ మాదిరిగా లండన్ క్లాస్ కుర్రాడు, చిత్తూరు మాస్ కుర్రాడు వుండే కద. ఈ కథను ముందుగా శర్వానంద్ కు చెప్పాడట దర్శకుడు మేర్లపాక గాంధీ.
అయితే ఎందుకో అంతగా కిక్ రాలేదు శర్వానంద్ కు. దాంతో వెనుకంజ వేసాడు. కానీ నానికి ధీమా వుంది. తన టైమ్ నడుస్తోంది. ఆందుకే మేర్లపాక గాంధీ కామెడీ స్టయిల్ కు, తన బాడీ లాంగ్వేజ్ జోడించి బండి లాగించేయగలననే ధీమాతో ఓకె చేసాడు.
మాస్, క్లాస్ లుక్స్ తో ఒకేలాంటి ఇద్దరు అబ్బాయిలు అంటే హలో బ్రదర్ లా ఫన్ కు లోటేముంటుంది? అయితే ఎటొచ్చీ చిన్న అనుమానం ఏమిటంటే, నాని క్లాస్, యూత్ క్లీన్ ఆడియన్స్ కు, సినిమాలో వుండే ఉమెన్ ట్రాఫికింగ్ టచ్ కు సెట్ అవుతుందా? అన్నదే. అది కూడా లైటర్ వీన్ లో వుంటే ఓకె. డార్క్ షేఢ్ ప్రెజెంట్ చేస్తే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుందేమో?