పవన్ దుస్తుల ఖర్చు ఎంత?

సినిమాకు హీరో అంటే ఆ రేంజ్ వేరు. ఆ ఖర్చు వేరు. కొంతమంది హీరోలు సినిమాలో తమ డ్రెస్ ల పట్ల పర్టిక్యులర్ గా వుంటారు. కొంతమంది వాళ్లే విదేశాలకు వెళ్లి కొని తెచ్చుకుంటారు.…

సినిమాకు హీరో అంటే ఆ రేంజ్ వేరు. ఆ ఖర్చు వేరు. కొంతమంది హీరోలు సినిమాలో తమ డ్రెస్ ల పట్ల పర్టిక్యులర్ గా వుంటారు. కొంతమంది వాళ్లే విదేశాలకు వెళ్లి కొని తెచ్చుకుంటారు.

మరి కొందరు పర్సనల్ డ్రెస్ డిజైనర్ లకు అప్పగిస్తారు. ప్రభాస్ తన దుస్తుల విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. సునీల్ కు బ్రాండ్ల పిచ్చి వుందని అంటారు. నాగశౌర్య మంచి దుస్తులు కావాలని పర్టిక్యులర్ గా ముందే చెబుతారు. అందువల్ల ఇలా అని పది నుంచి పాతిక లక్షల వరకు సినిమాలో హీరో డ్రెస్ ల కోసం ఖర్చు చేస్తారు. 

ఇదిలా వుంటే అజ్ఞాతవాసి లాంటి భారీ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ దుస్తుల కోసం అయిన ఖర్చు ఎంత? 135కోట్ల మేకింగ్ లో కాస్ట్యూమ్స్ వాటా కాస్త ఎక్కువే అని తెలిసింది. లెక్కకు మించి డిజైనర్లు ఈ సినిమా కోసం పని చేసారని వినికిడి. ఇద్దరు హీరోయిన్లు, ఓ హీరో వుండడంతో కాస్త గట్టిగానే ఖర్చయిందట.

కేవలం పవన్ కళ్యాణ్ డ్రెస్ ల కోసం 90లక్షల బిల్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ప్రభాస్ కు పనిచేసే డ్రెస్ డిజైనర్ నే ఈ సినిమా కోసం పవన్ కు డ్రెస్ లు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 

అలా చేసిన బిల్లు తడిసి మోపెడై 90లక్షలకు చేరినట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ల కోసం లేడీ డిజైనర్లు కూడా భారీగా బిల్లులు సమర్పించినట్లు తెలుస్తోంది. మరింకేం మాట్లాడలేక పేమెంట్లు చేసారు యూనిట్ బాధ్యులు.