భరత్ అనే నేను. 2018లో రాబోయే సినిమాల్లో ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో ఒకటి. ఈ సినిమా సంక్రాంతికే వస్తుందనుకున్నారు. కానీ వర్క్ పూర్తి కాలేదు. ఏప్రియల్ అన్నది తాజా డేట్.
అయితే అదే సమయంలో అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా కూడా వుంది. ఎవరో ఒకరు అటు ఇటు జరగాలి. బన్నీ సినిమా జరిగే ప్రసక్తి కనిపించడం లేదు.
ఇదిలా వుంటే భరత్ అనే నేను సినిమా వర్క్ కూడా కాస్త బాగానే వుంది. రెండు పాటలు, రెండు ఫైట్లు, ఇంకా మరి కొన్ని వ్యవహారాలు పెండింగ్ లో వున్నాయి.
అందువల్ల వర్క్ పూర్తవడానికి కొంచెం టైమ్ పడుతుందని తెలుస్తోంది. ఏప్రియల్ నుంచి వెనక్కు జరగాలంటే మే నెలకు వెళ్లాలి. కానీ మహేష్ కు మే అంటే బ్యాడ్ సెంటిమెంట్. అందుకే జూన్ కు వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
కానీ మాంచి సమ్మర్ టైమ్ ను వదులుకుని, జూన్ కు వెళ్లడం కరెక్టేనా అన్న డిస్కషన్లు కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఏం డిసైడ్ అవుతారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి.