ఏడాది గ్యాప్ ను ఒకేసారి భర్తీ చేస్తాడట

గతేడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేకపోయిన చరణ్.. ఆ గ్యాప్ ను ఈ ఏడాది భర్తీ చేస్తానంటున్నాడు. ఏకంగా 3సినిమాలతో సూపర్ హిట్స్ అందిస్తామని ధీమాగా చెబుతున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం…

గతేడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేకపోయిన చరణ్.. ఆ గ్యాప్ ను ఈ ఏడాది భర్తీ చేస్తానంటున్నాడు. ఏకంగా 3సినిమాలతో సూపర్ హిట్స్ అందిస్తామని ధీమాగా చెబుతున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమా చేస్తున్నాడు చెర్రీ. మార్చి 30న విడుదలకానున్న ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చెబుతున్నాడు. ఈ మూవీతో ఈ ఏడాదిలో బోణీ కొడతానంటున్నాడు.

ఈ నెలాఖరుకు రంగస్థలం షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అది పూర్తయిన వెంటనే బోయపాటి డైరక్షన్ లో సినిమాకు రెడీ అవుతాడు చరణ్. రంగస్థలం కోసం ఇన్నాళ్లూ పెంచిన గుబురు గడ్డం, మీసాన్ని తీసేయబోతున్నాడు.

తాజా సమాచారం ప్రకారం.. ఈనెల 20నుంచి బోయపాటి-చరణ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. అంటే.. ఈ నెలాఖరుకు చెర్రీ క్లీన్ షేవ్ లోకి వచ్చేస్తాడన్నమాట. బోయపాటి సినిమాను దసరాకు విడుదల చేయాలనేది ప్లాన్.

ఇలా తను హీరోగా చేస్తున్న 2సినిమాలతో పాటు నిర్మాతగా తెరకెక్కిస్తున్న మరో సినిమాతో కూడా సక్సెస్ అందుకుంటానంటున్నాడు చరణ్. అదే సైరా నరసింహారెడ్డి. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా తాజాగా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.

వచ్చేనెల నుంచి రెండో షెడ్యూల్ మొదలవుతుంది. చరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదలవుతుంటున్నాడు చరణ్. ఇలా ఈ 3సినిమాలు ఈ ఏడాది సూపర్ హిట్ సాధిస్తాయని చెబుతున్నాడు.