ముందు ప్రచారం.. తర్వాతే పార్టీ

తన పార్టీకి ఇంకా పేరు కూడా పెట్టలేదు. జెండా, ఎజెండా లాంటి వివరాల్ని వెల్లడించలేదు. కానీ పొలిటికల్ టూర్ మాత్రం షురూ చేశాడు కమల్ హాసన్. పార్టీకి ఏం పేరు పెట్టామనే విషయం కంటే…

తన పార్టీకి ఇంకా పేరు కూడా పెట్టలేదు. జెండా, ఎజెండా లాంటి వివరాల్ని వెల్లడించలేదు. కానీ పొలిటికల్ టూర్ మాత్రం షురూ చేశాడు కమల్ హాసన్. పార్టీకి ఏం పేరు పెట్టామనే విషయం కంటే ప్రజల్లోకి ఎంత తొందరగా చొచ్చుకెళ్లామనేది ఇంపార్టెంట్ అంటున్నాడు. చెన్నైలో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్ లో మాట్లాడిన కమల్.. రిపబ్లిక్ డే నుంచి తను ప్రజల్లోనే ఉంటానని ప్రకటించాడు.

తన గురించి, తన రాజకీయ రంగప్రవేశం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాడు కమల్. దీనికోసం ఇప్పటికే ఓ వెబ్ సైట్ ప్రారంభించాడు. కానీ వెబ్ సైట్ లో వచ్చే అభిప్రాయాల కంటే.. నేరుగా ప్రజల్ని కలిసి వాళ్ల మనసులో మాట తెలుసుకోవడం మంచిదని భావిస్తున్నాడు. అందుకే పార్టీ గుర్తు, పేరు లాంటి విషయాల్ని ప్రకటించక ముందే పొలిటికల్ టూర్ కు రంగం సిద్ధంచేశాడు.

ప్రస్తుతం కమల్ చేతిలో విశ్వరూపం-2, శభాష్ నాయుడు సినిమాలున్నాయి. వీటిలో విశ్వరూపం-2 దాదాపు పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కొలిక్కి వచ్చింది. రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి విడుదల చేయడమే ఆలస్యం. అటు శభాష్ నాయుడు సినిమా మాత్రం ఇప్పట్లో పూర్తికాదు. విశ్వరూపం-2 విడుదలకు ముందే రాజకీయ పర్యటనలు పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యాడు కమల్.