అజ్ఞాతవాసిలో వెంకీ క్యారెక్టర్ ఇదే

అజ్ఞాతవాసిలో హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నాడన్న వార్త బయటకు వచ్చిన దగ్గర నుంచి క్యూరియాసిటీ పెరిగింది. వెంకటేష్ చేయదగ్గ పాత్ర ఏమై వుంటుంది? అని. ప్రేమమ్ సినిమాలో చైతూ మామయ్యగా, డిసిపి రామచంద్రగా కనిపించి…

అజ్ఞాతవాసిలో హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నాడన్న వార్త బయటకు వచ్చిన దగ్గర నుంచి క్యూరియాసిటీ పెరిగింది. వెంకటేష్ చేయదగ్గ పాత్ర ఏమై వుంటుంది? అని. ప్రేమమ్ సినిమాలో చైతూ మామయ్యగా, డిసిపి రామచంద్రగా కనిపించి జస్ట్ అలా మెరుపులు మెరిపించాడు. ఇప్పుడు అజ్ఞాతవాసిలో ఏం చేస్తాడు? అనుకున్నారు.

కానీ ఆ సీన్ ను కట్ చేసి పక్కన పెట్టి తరువాత విడుదల చెద్దాం అని డిసైడ్ అయి సినిమా వదిలేసాడు దర్శకుడు త్రివిక్రమ్. ఆ సీన్ నే కాదు, మరికొన్ని సీన్లు కూడా వెనక్కు పెడుతున్నాడని ముందే చెప్పేసాం.

అయితే ఇంతకీ వెంకీ చేసిన కామియో రోల్ ఏమయివుంటుంది? అదే ఇప్పుడు చెప్పబోతున్నది. అజ్ఞాతవాసి సినిమా చూసిన వాళ్లకు అందులో ఓ ఫైట్ గుర్తుండే వుంటుంది. హీరోయిన్ అక్కడే వున్నా కూడా ఆమెకు తెలియకుండా, సైలెంట్ గా తనపై గన్స్ తో అటాక్ చేయడానికి వచ్చిన వాళ్లను హీరో చంపడం. దానికే సినిమాలో త్రివిక్రమ్ భారతంలోని పాండవుల వ్యవహారంతో ముడిపెట్టి, ఓ పక్క ఫైట్ అవుతుంటే మరోపక్క పురాణ కాలక్షేపం చేయించి, ఎంత గజిబిజి చేయాలో అంతా చేసాడు. ఆయన అభిరుచి ఆయనది.

సరే, ఆ ఫైట్ అయిన తరువాత పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో వెంకీ వస్తాడు. వచ్చి, ఎవరు చేసారు ఇదంతా అంటాడు. అంటే అప్పుడు హీరో పవన్ ‘నేనే’ అంటాడు. నువ్వా.. ఎందుకు చేసావ్ అంటాడు వెంకీ. నా మీదకు వచ్చారు చంపాను అంటాడు. నమ్మేలా లేదయ్యా.. నువ్వు ఇంతమందిని చంపావంటే అంటాడు వెంకీ.

అక్కడితో ఆగుతాడా? నిన్ను చూస్తుంటే, అదేదో సినిమాలో, ‘నాకో తిక్కుంది.. దానికో లెక్కుంది’ అనే డైలాగ్ చెప్పిన హీరొలా కనిపిస్తున్నావు. అతగాడికి నీకు పోలికలు వున్నాయి అంటాడు.

అవునా సర్, నేను కూడా చూసాను సర్ ఆ సినిమా, అంటూ లెక్క.. తిక్క డైలాగ్ ను రిపీట్ చేస్తాడు పవన్. దానికి వెంకీ కౌంటర్ వేస్తూ, ‘అబ్బే.. నువ్వు బాగా చెప్పలేదయ్యా.. ఆ హీరోనే బాగా చెప్పాడు’ అంటూ వెళ్లిపోతాడు.

వాస్తవానికి ఈ క్యారెక్టర్ ను మొదట థర్టీ ఇయర్స్ పృధ్వీ చేత వేయించాలనుకున్నాడు. కానీ ఆ తరువాత మనసు మార్చుకుని వెంకీని సీన్ లోకి తీసుకువచ్చాడు. కనీసం ఈసీన్ అటాచ్ చేసినా ఫ్యాన్స్ కాస్త హ్యాపీ ఫీలయ్యేవారేమో? అనవసరంగా పక్కన పెట్టారు.