Advertisement


Home > Movies - Movie Gossip
బాహుబలి తరువాత మళ్లీ

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ పేరు బాహుబలి తరువాత మళ్లీ మోత మోగింది. కానీ మళ్లీ తరువాత సరైన సినిమా పడలేదు. త్వరలో నాగ చైతన్య అత్తగారిగా, శైలజరెడ్డి అల్లుడు సినిమాలో నటించబోతోంది. అయితే ఈలోగా మళ్లీ మాంచి సినిమాగా తనకు గ్యాంగ్ పేరు తెస్తుందని రమ్యకృష్ణ మాంచి కాన్ఫిడెంట్ గా వుందట. 

రమ్యకృష్ణకు మాంచి కామెడీ టైమింగ్ వుంది. అది ఎక్కువగా వాడిన సినిమాలు తక్కువ. సూర్య నటించిన గ్యాంగ్ సినిమా మాత్రం పక్కాగా ఆ జోనర్ లో తనకు పేరు తెస్తుందని భావిస్తోందట రమ్యకృష్ణ. వాస్తవానికి ఈ సినిమా జోనర్ ఏమిటన్నది ఇంకా జనాల్లోకి క్లారిటీగా వెళ్లలేదు. కామెడీ ప్లస్ థ్రిల్లర్ జోనర్ కు చెందిన ఈ సినిమా గ్రౌండ్ లెవెల్ ఆడియన్స్ ను తప్పని సరిగా ఎంటర్ టైన్ చేస్తుందని అంటున్నారు.

పవన్, బాలయ్య సినిమాల నడుమ కొంచెం స్లోగా జనంలోకి వెళ్లినా, మంచి స్టాండ్ వుంటుందని నిర్మాతలు యువి క్రియేషన్స్ బలంగా నమ్ముతున్నారు. అందుకే సుమారు 300కు పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. విడుదలయ్యాక కచ్చితంగా వంద స్క్రీన్ ల వరకు పెరుగుతాయని నమ్మకంగా వున్నారు.