ఇక్కడ ఏదైనా సాధ్యమే. అది రాజకీయాలు కావచ్చు. సినిమాలు కావచ్చు. నిన్నటికి నిన్న కత్తి మహేష్ నేరుగా ఆరు ప్రశ్నలు పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి జమిలిగా సంబంధించినపుడు అందరూ అదో సంచలనంగానే చూసారు. కానీ అసలు అవి కత్తి మహేష్ కు ఎలా వచ్చి వుంటాయి అన్నది పెద్దగా ఆలోచించలేదు.
నిజానికి కత్తి మహేష్ నిన్న మొన్నటి వరకు ఓ రివ్యూ రైటర్ మాత్రమే. గ్యాసిప్ లు సేకరించి రాసే జర్నలిస్ట్ కాదు. అలా అని కత్తి సంధించిన ప్రశ్నలు ఇప్పటికే గ్యాసిప్ లు గా చలామణీలో వున్నవి కాదు. పవన్ కళ్యాణ్ పోస్ట్ ఇప్పించారన్నది ఒక్కటే గతంలో గ్యాసిప్ గా వినిపించింది. అలాగే పూనమ్ తల్లి పవన్ తో మాట్లాడిందన్న గ్యాసిప్ మాత్రం గతంలో వినిపించింది.
అంతే కానీ, పూనమ్ ఆత్మహత్య ప్రయత్నం చేసిందన్నది, ఆసుపత్రిలో చేరారన్నది, బిల్లు పవన్ కట్టారన్నది, త్రివిక్రమ్ పై కోపం అన్నది ఎక్కడా వినిపించని కొత్త సంగతులు. ఇవన్నీ కత్తి మహేష్ చాలా గట్టిగాచెప్పారు.
అంతే కాదు, ఓ చానెల్ లో మాట్లాడుతూ తాను ఇలా ప్రశ్నలు సంధించడం వల్ల పూనమ్ కు మంచే జరుగుతుంది చూడండి అని ఒకటికి పదిసార్లు అన్నారు. అంతే కాదు ఆధారాలు వున్నాయి.. ఆధారాలు వున్నాయి అన్నారు. పైగా కాదని పూనమ్ ను చెప్పమనండి చూద్దాం. అప్పుడు తాను చెబుతా అన్నారు.
ఇప్పుడు ఈ రోజు పూనమ్ రెండు ట్వీట్ లు పవన్ ను ట్యాగ్ చేస్తూ చేసి, వెంటనే డిలీట్ చేయడంతో ఇండస్ట్రీలో కొత్త డిస్కషన్లు స్టార్ట్ అయ్యాయి. అసలు కత్తి మహేష్ కు పూనమ్ నే లీకులు ఇచ్చి వుండొచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
పూనమ్ వ్యవహార శైలిపై ఇండస్ట్రీలో నిజాలో అబద్దాలో తెలియని గుసగుసలు చాలా వున్నాయి. అందుకే పవన్ అభిమానులు, కూడా మహేష్ కత్తి ద్వారా పూనమ్ తనకు కావాల్సింది ఏదో సాధించే ఫ్రయత్నం చేస్తోందని వినిపిస్తోంది. చెప్పలేం సినిమా రంగంలో, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.