నాగ చైతన్య-మారుతి కాంబినేషన్ లో హారిక హాసిని సంస్థ నిర్మించే శైలజరెడ్డి అల్లుడు సినిమా షూట్ ఈ నెల 19నుంచి ప్రారంభమవుతోంది. 11నుంచి ప్రారంభించాలని మొదట అనుకున్నారు కానీ, కంటిన్యూగా సవ్యసాచి షెడ్యూలు చేయడం వల్ల రెండు రోజులు గ్యాప్ తీసుకోవాలని నాగ చైతన్య అనుకున్నట్లు తెలుస్తోంది.
ఆ వెంకనే సంక్రాంతి సెలవులు వస్తున్నాయి. అదే విధంగా సవ్యసాచి గెటప్ కు సమస్య రాకుండా, అలా అని అదే గెటప్ కంటిన్యూ కాకుండా కాస్త వైవిధ్యం వుండేలా చైతూ గెటప్ వుండేలా చూడడానికి రెండు రోజులు టైమ్ పడుతుంది.
అందువల్ల ఏకంగా 19న స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. అప్పటి నుంచి కంటిన్యూగా సుమారు ఇరవై రోజుల వరకు ఒక షెడ్యూలు చేసి బ్రేక్ ఇస్తారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో చైతూ సరసన అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. హీరో హీరోయిన్ల ఇగో సమస్యల కాన్సెప్ట్ తో సీరియస్ గా కాకుండా, కాస్త ఎంటర్ టైన్ మెంట్ పాలు ఎక్కువగా వుండేలా ఈ స్క్రిప్ట్ ను మారుతి డిజైన్ చేస్తున్నారు.
సవ్యసాచి, శైలజ రెడ్డి అల్లుడు రెండు సినిమాలకు జస్ట్ వన్ మంథ్ గ్యాప్ తో రెడీ అయిపోయేలా నాగ చైతన్య డేట్లు అడ్జస్ట్ చేస్తున్నాడు.