భాగవతి సినిమా రెండేళ్ల బట్టి నిర్మాణంలో వుంది. అలాంటి సినిమా ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుంది అంటూ జనవరి 26కు డేట్ ఫిక్స్ చేసారు. అయినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ట్రయిలర్ బయటకు వచ్చింది. ఇది కదా భాగమతి అన్నట్లుగా, చివర్న అనుష్క సర్రున డైలాగ్ వదిలింది. దాంతో ట్రయిలర్ మొత్తం టర్న్ అయిపోయింది.
26న సినిమాలు వదలాలి అనుకుంటున్నవారు ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే భాగమతి ట్రయిలర్ అంత ప్రామిసింగ్ గా వుంది. అసలే కాస్త హర్రర్ జోనర్ అంటే జనాలు లైన్ కట్టేస్తున్నారు. దానికి తోడు. అరుంధతి తరువాత మళ్లీ అనుష్క అలాంటి సినిమాలో కనిపించలేదు. ఇప్పుడు జనాలు అందరికీ మళ్లీ మరోసారి అరుంధతి సినిమా కళ్లు ముందుకు వచ్చింది.
అనుష్క.. అరుంధతి.. ఆపైన భాగమతి. ఇక కచ్చితంగా ఆ లైనప్ లో బజ్ వచ్చేస్తుంది. దర్శకుడు అశోక్ సినిమాను పాడుచేయకుండా ప్రెజెంట్ చేసి వుంటే చాలు. యువి పంట పండినట్లే.