అజ్ఞాతవాసి కేవియట్ జాగ్రత్త?

అజ్ఞాతవాసి యూనిట్ వర్గాలు తగిన జాగ్రత్తతోనే వున్నాయి. లాస్ట్ మినిట్ లో ఎక్కడ ఏ సమ్యస వస్తుందో అని ఆలోచించి కేవియట్ తెచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. Advertisement వాస్తవానికి టి సీరిస్ నుంచి…

అజ్ఞాతవాసి యూనిట్ వర్గాలు తగిన జాగ్రత్తతోనే వున్నాయి. లాస్ట్ మినిట్ లో ఎక్కడ ఏ సమ్యస వస్తుందో అని ఆలోచించి కేవియట్ తెచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.

వాస్తవానికి టి సీరిస్ నుంచి పెద్దగా థ్రెట్ లేదు. కేవలం స్క్రిప్ట్ చూపించండి. ముందు తాము లార్గో వించ్ కు ఏమాత్రం కనెక్ట్ అవుతుందో చూస్తామని అంటున్నట్లు తెలుస్తోంది. అయితే మరోపక్క కోర్టు ద్వారా, ఇంకో పక్క చాంబర్ లో మాటల ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఇదంతా స్మూత్ గానే జరుగుతునట్లు వినికిడి.

అయినా కూడా టీ సీరీస్ లాస్ట్ మినిట్ లో ఏదైనా స్టే లాంటి దానికి వెళ్లి, విడుదలకు బ్రేక్ వేస్తుందేమో అన్న అనుమానం వుండనే వుంది. అందుకే ముందు జాగ్రత్తగా హారిక హాసిని యూనిట్ వర్గాలు కోర్టులో కేవియట్ అప్లయ్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే కేవియట్ ఏ కోర్టులో తెచ్చారు? ఎన్ని కోర్టుల్లో కేవియట్ అప్లికేషన్లు వేసారు అన్న దాని మీద భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. 14కోర్టుల్లో కేవియట్ వేసారని తెలుస్తోంది.

మొత్తానికి అజ్ఞాతవాసి విడుదలకు ఏ విధమైన అడ్డంకి లేకుండా వీలయినంత ముందు జాగ్రత్తలు లీగల్ గా కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.