కొరటాలశివ-అఖిల్-నిరంజన్ రెడ్డి?

అక్కినేని అఖిల్ తరువాతి సినిమా సంగతేమిటి? కొరటాల శివ-అఖిల్ కాంబో సినిమా ఫిక్స్ అవుతుందా? ఈ విషయంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పివిపి సంస్థతో కలిసి సినిమాలు నిర్మించిన మాట్నీ ఎంటర్ ప్రైజెస్ అధినేత నిరంజన్…

అక్కినేని అఖిల్ తరువాతి సినిమా సంగతేమిటి? కొరటాల శివ-అఖిల్ కాంబో సినిమా ఫిక్స్ అవుతుందా? ఈ విషయంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పివిపి సంస్థతో కలిసి సినిమాలు నిర్మించిన మాట్నీ ఎంటర్ ప్రైజెస్ అధినేత నిరంజన్ రెడ్డి తన తరువాత సినిమాను అఖిల్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

నిరంజన్ రెడ్డి ప్రాజెక్టు ఒకటి పెండింగ్ లో వుంది. రామ్ చరణ్ హీరోగా, కొరటాలశివ డైరక్షన్ లో ఆయన సినిమా వుంది. అయితే ప్రస్తుతం బోయపాటి డైరక్షన్ లో రామ్ చరణ్ ఓ సినిమా స్టార్ట్ చేస్తున్నారు. అది అయ్యాక కానీ కొరటాల ప్రాజెక్టు మీదకు రారు. కొరటాల కనుక త్వరగా మహేష్ ప్రాజెక్టును ఫినిష్ చేసి, రామ్ చరణ్ సినిమాలోగా, అఖిల్ తో ఒక సినిమా చేయడానికి వీలు వుంటుందా అనే దానిపై ఇప్పుడు డిస్కషన్లు సాగుతున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ కొరటాల శివ ఒకె అంటే అఖిల్ సినిమాను కూడా తానే నిర్మించడానికి నిర్మాత నిరంజన్ రెడ్డి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మహేష్ బాబు సినిమా వ్యవహారాలతో బిజీగా వున్న కొరటాల శివ ఏ విషయమూ డిసైడ్ చేసుకోలేదని తెలుస్తోంది. వన్స్ కొరటాల శివ ఓకె అంటే మరో క్రేజీ కాంబినేషన్ కు శ్రీకారం చుట్టినట్లు అవుతుంది.