అజ్ఖాతవాసి టికెట్ బుకింగ్ లు అప్పుడే ప్రారంభమైపోయిన సంగతి తెలిసిందే. బుక్ మై షో అప్లికేషన్ లో టికెట్ ల బుకింగ్ ప్రారంభమైపోయింది. బెంగళూరు, హైదరాబాద్ లతో పాటు, ఆంధ్రలోని గుంటూరు, టంగుటూరు, ఒంగోలు, విశాఖ, అలాగే తెలంగాణల్లోని కొన్ని అర్బన్ సెంటర్లకు గాను బుక్ మై షో టికెట్ బుకింగ్ ప్రారంభమైంది.
బుక్ మై షో టికెట్ లు అమ్ముతున్న ఈ ప్రాంతాల్లో సాధారణంగా టికెట్ ల ధరలు వేరుగా వుంటాయి. కానీ ఇప్పుడు ఒకటే యూనిఫారమ్ రేటు ఫిక్స్ చేసేసారు. రెండు వందలు ప్లస్ చార్జీలు కలిపి 225రూపాయిలకు పైనే టికెట్ ధర నిర్ణయించారు. ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రం, చార్జీలు ఇప్పుడు తీసుకుని, టికెట్ ధరను కౌంటర్ లో చెల్లించాలని నోటిఫికేషన్ ఇస్తున్నారు. టికెట్ ధర ఆ రోజు ఫిక్స అవుతుందట.
మరి రెండువందల వంతున యూనిఫారమ్ రేటు అమ్మడానికి ఆంధ్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా? లేదా? అన్నది తెలియదు. కొన్ని అర్బన్ సెంటర్లలోని కొన్ని థియేటర్లలో మాత్రమే బుకింగ్ ఓపెన్ చేసారు. ఇవేవీ ఫ్రధానమైన థియేటర్లు కావు. అందువల్ల తొలి రోజు అన్ని థియేటర్లలో అన్ని షో లు ఇంకా ఫుల్ కాలేదు. మిగిలిన ప్రథానమైన థియేటర్లు ఓపెన్ అవుతాయన్న ఉద్దేశంతో జనం వేచి వున్నట్లు కనిపిస్తోంది.
ఇలా అన్ని సెంటర్లలో, అన్ని రకాల టికెట్ లు రెండువందల వంతున అమ్మడం అంటే మాంచి కలెక్షన్లు తొలి రోజు చూపించే అవకాశం, సినిమా మంచి లాభాలు చేసుకునే అవకాశం వుంటుందనే అనుకోవాలి. కానీ ఇది చట్టపరంగా కరెక్ట్ కాదో అన్నది ఎవరు కనుక్కుంటారు?