మహేష్ బంధువు హీరోగా..

సినిమా కుటుంబాలు అంటేనే హీరోల ఉత్పత్తి కర్మాగారాలు. దానికి తోడు కాస్త డబ్బులుండి, పొలిటికల్ బ్యాక్ గ్రవుండ్ వుంటే హీరో కావడానికి ఇంక అడ్డేముంది. ఇప్పుడు ఈ కోటాలో మరో హీరో రాబోతున్నాడట. Advertisement…

సినిమా కుటుంబాలు అంటేనే హీరోల ఉత్పత్తి కర్మాగారాలు. దానికి తోడు కాస్త డబ్బులుండి, పొలిటికల్ బ్యాక్ గ్రవుండ్ వుంటే హీరో కావడానికి ఇంక అడ్డేముంది. ఇప్పుడు ఈ కోటాలో మరో హీరో రాబోతున్నాడట.

సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, ఎంపీ గల్లా జయదేవ్ సోదరి డాక్టర్ రమాదేవి గౌరినేని కుమారుడుని త్వరలో హీరోగా పరిచయం చేయబోతున్నారట.

ఈ బాధ్యతను నిర్మాత దిల్ రాజు మీద పెట్టారట. ఇఫ్పటికే దిల్ రాజు ఓ సినిమాను మహేష్ బాబు హీరోగా చేస్తున్నారు. అందువల్ల మరింక మాట కొట్టేసేదేముంటుంది. 

పైగా పెట్టుబడి ఎలాగూ హీరో ఫ్యామిలీనే పెట్టుకుంటుంది కదా? దిల్ రాజు దగ్గర చాలా మంది దర్శకులు, స్క్రిప్ట్ లు రెడీగా వుంటాయి. కనుక ఏదో ఒకటి సెట్ చేసేస్తారు. 2018లో దిల్ రాజు తీయబోయే ఏడు సినిమాల లెక్కలో ఈ సినిమా కూడా వుంటుందని తెలుస్తోంది.

ఇదిలా వుంటే ఇది కాక, కొత్త వాళ్లతో ఓ సినిమా చేయాలన్న ఆలోచనలో కూడా దిల్ రాజు వున్నట్లు తెలుస్తోంది.