అ.. అనిపించిదిగా

హీరో నాని సమర్పణలో ఒక డిఫరెంట్ ఫిల్మ్ రూపు దిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. అ అనే పేరుతో తయారవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల వరుసగా వదుల్తున్న పోస్టర్లన్నీ సినిమా మీద కాస్త ఆసక్తి…

హీరో నాని సమర్పణలో ఒక డిఫరెంట్ ఫిల్మ్ రూపు దిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. అ అనే పేరుతో తయారవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల వరుసగా వదుల్తున్న పోస్టర్లన్నీ సినిమా మీద కాస్త ఆసక్తి రేకెత్తిస్తే, ఇప్పుడు విడుదలయిన టీజర్ ఆ ఆసక్తిని డబుల్ చేసింది.

నాని సమర్పిస్తున్నాడు అని తెలిసినపుడే సినిమా సమ్ థింగ్ డిఫరెంట్ అనుకున్నారు. ఇప్పుడు టీజర్ ఆ విషయాన్ని మరింత క్లియర్ చేసింది.

అ పోస్టర్లు, ఇప్పటికి దాకా బయటకు వచ్చిన విషయాలు అన్నీ కూడా క్యూరియాసిటీని పెంచేవిగా వున్నాయి తప్ప, కథపై ఎలాంటి క్లూ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ టీజర్ కూడా అంతే.

పోస్టర్లు గా వచ్చిన లుక్ లను విడియోగా చూపించాయి. దాంతో పాటు గన్స్, బుల్లెట్స్ వంటివి, డిఫరెంట్ సైంటిఫిక్ బ్యాక్ గ్రవుండ్ షాట్స్ మిక్స్ చేయంతో కాస్త సైంటిఫిక్ థ్రిల్లర్ లేదా, సైంటిఫిక్ ఫాంటసీ లుక్ వుండొచ్చు అని తెలుస్తోంది.

ఏమైనా డిఫరెంట్ సినిమాలు చేయడమే కాదు, నిర్మంచడం ద్వారా నాని మంచి మార్కులు కోట్టేటట్లే వున్నాడు.