ఎన్టీఆర్ చేయనిది పవన్ చేసాడు

అజ్ఞాతవాసి సినిమాకు సంబంధించిన ప్రచారానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టాడు. సినిమా గురించి మాట్లాడి, సినిమా చూడండి, బాగుంటుంది ఇలాంటి మాటలు చెప్పడం, అపీల్ చేయడం పవర్ స్టార్ రేంజ్ కు…

అజ్ఞాతవాసి సినిమాకు సంబంధించిన ప్రచారానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టాడు. సినిమా గురించి మాట్లాడి, సినిమా చూడండి, బాగుంటుంది ఇలాంటి మాటలు చెప్పడం, అపీల్ చేయడం పవర్ స్టార్ రేంజ్ కు మరీ చీప్ గా వుంటుంది. అందుకే వీలయినంత డిగ్నిఫైడ్ గా పవన్ మెసేజ్ రికార్డు చేసినట్లు కనిపిస్తోంది.

అయితే ఇక్కడ చిన్న గమ్మత్తయిన సంగతి ఒకటి వుంది. ఇటీవల ఓవర్ సీస్ మార్కెట్ బాగా పెరిగింది. అజ్ఞాతవాసి ఓవర్ సీస్ రేటు 19కోట్లు. అంటే కలెక్షన్లు సుమారుగా పాతిక కోట్లకు పైగా వుండాలి. అంటే మార్కెట్ రేంజ్ పాతిక కోట్లు అన్నమాట. ఆ రేంజ్ మార్కెట్ వున్నపుడు హీరోలు సినిమా ఓవర్ సీస్ ప్రమోషన్ కు దిగక తప్పదు. అయితే పెద్ద హీరోల ప్రమోషన్ కాస్త క్లాస్ గా వుంటుంది.

గతంలో జై లవకుశ సినిమా విడుదల టైమ్ లో ఎన్టీఆర్ తో ఇలాంటి విడియో బైట్ నే విడుదల చేయిద్దాం అనుకున్నారట. కానీ దానికి ఎన్టీఆర్ ఎక్కువ సుముఖత వ్యక్తం చేయలేదని వినికిడి. దాంతో అప్పట్లో బయ్యర్లు ఏమీ చేయలేక సైలెంట్ అయిపోయారు.

కానీ ఈసారి ఇలాంటి ప్రపోజల్ ను ఓవర్ సీస్ బయ్యర్లు ఎల్ ఎ తెలుగు సంస్థ వాళ్లు అడగడంతో పవన్ వెంటనే ఓకె చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్ర, నైజాం, కర్ణాటక మార్కెట్ ల మాదిరిగానే ఓవర్ సీస్ మార్కెట్ కీలకం అయినందున ఇక ప్రచారం కూడా హీరోలు బైట్ ఇవ్వడం కరెక్టే అని భావించి పవన్ సై అన్నట్లు తెలుస్తోంది.