అంతా తండ్రీ కూతుళ్ల మధ్యే

ఓ సినిమా మొత్తం తండ్రీ కూతుళ్ల మధ్య తిరగడం అంటే కథ మీద ఎంత నమ్మకం వుండాలి. డైరక్టర్ కు ఎంత ధైర్యం వుండాలి. కాస్త గ్యాప్ తరువాత సీనియర్ హీరో మోహన్ బాబు…

ఓ సినిమా మొత్తం తండ్రీ కూతుళ్ల మధ్య తిరగడం అంటే కథ మీద ఎంత నమ్మకం వుండాలి. డైరక్టర్ కు ఎంత ధైర్యం వుండాలి. కాస్త గ్యాప్ తరువాత సీనియర్ హీరో మోహన్ బాబు చేస్తున్న గాయత్రి సినిమా స్టోరీ మొత్తం తండ్రి కూతుళ్ల మధ్యనే నడుస్తుందట. మోహన్ బాబు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆయన యంగ్ క్యారెక్టర్ గా మంచు విష్ణు కనిపిస్తాడు. భార్యగా శ్రియ కనిపిస్తుంది. ఆ తరువాత ఆ క్యారెక్టర్ వుండదు.

మోహన్ బాబు విలన్ గా మరో క్యారెక్టర్ కూడా పోషిస్తున్నారు. మదన్ పూర్తిగా మానవ సంబందాలు, భావోద్వేగాలతో సాగే మాంచి కథను రెడీ చేసారట. ఈ కథలో కూతురు పాత్ర పక్కన హీరో కూడా వుండడని తెలుస్తోంది. కేవలం తండ్రి, కూతుళ్లు, విలన్ మధ్యనే సినిమా నడుస్తుందట.

ఆ నలుగురు, పెళ్లయిన కొత్తలో సినిమాల్లో ఎలా అయితే మాంచి మానవ సంబంధాలను తెరమీదకు తెచ్చాడో, అలాగే మరోసారి వాటిని హైలైట్ చేస్తూ కథ  రాసుకున్నాడట డైరక్టర్ మదన్. గరం సినిమా తెచ్చిన బ్యాడ్ నేమ్ ను గాయత్రి పొగోడుతుందని ధీమాగా వున్నాడు.