హీరో అంటే పాటలు, డ్యాన్స్ లు, ఫైట్లు. కానీ వెంకీ రూటు వేరు. వైవిధ్యమైన సినిమాలు ట్రయ్ చేస్తూ వస్తున్నాడు. దృశ్యంలో, గోపాలగోపాలలో తన వయస్సుకు తగినట్లు పిల్లల తండ్రిగా నటించాడు. ఇప్పడు మరోసారి ఇద్దరు పిల్లల తండ్రిగా ఓ సినిమా చేయబోతున్నాడు.
తేజ డైరక్షన్ లో షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఆ సినిమాకు హీరోయిన్ నే ఇంకా ఫిక్స్ కాలేదు. కాజల్ నే మొదట్నించీ అనుకుంటున్నారు. కానీ ఆమె డేట్ లు సెట్ కావడం లేదు. ఆమె కోటి రూపాయిలు అడుగుతోంది. దానికి అభ్యంతరం ఏమీ లేదు. కానీ డేట్ లు కావాలి. తెలుగు తమిళ సినిమాల్లో నటిస్తున్న కాజల్ డేట్ లు, వెంకీ సినిమాకు కావాల్సిన డేట్ లు సింక్ కావడం లేదు.
ఇక త్రిష, తమన్నాలను అనుకున్నారు కానీ, సినిమాకు ఏ మాత్రం ప్లస్ కారని పక్కన పెట్టారు. కాజల్ మీదే టోటల్ ఒపీనియన్ వుంది. డేట్ లు సెట్ అయితే సెట్ మీదకు వచ్చేస్తుంది కాజల్ ఇద్దరు పిల్లల తల్లిగా.