ఆ హీరోతో ఫ్యామిలీ సినిమా?

కళ్యాణ్ కృష్ణ అంటే తీసిన రెండూ ఫ్యామిలీ ఎంటర్ టైనర్లే. మరి హీరో రవితేజ అంటే..? పక్కా బి సి సెంటర్ల మాస్ మసాలా. మరి ఇప్పుడు ఎవరి కోసం ఎవరు మారతారు? డౌటే…

కళ్యాణ్ కృష్ణ అంటే తీసిన రెండూ ఫ్యామిలీ ఎంటర్ టైనర్లే. మరి హీరో రవితేజ అంటే..? పక్కా బి సి సెంటర్ల మాస్ మసాలా. మరి ఇప్పుడు ఎవరి కోసం ఎవరు మారతారు? డౌటే లేదు డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ మాస్ సినిమా చేస్తాడు అని అనుకుంటారేమో? కానే కాదట.

హీరో రవితేజ ఇప్పుడు చేసే ప్రతి సినిమా డిఫరెంట్ గా వుండాలనుకుంటున్నాడట. ఇక ఇంత సీనియార్టీ వచ్చాక, రోటీన్ సినిమాలు చేయకూడదనుకుంటున్నాడట. అందుకే కళ్యాణ్ కృష్ణ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.

ఈ సినిమాకు టైటిల్ మాస్ గా వున్నా, సబ్జెక్ట్ ఫ్యామిలీ స్టోరీనే వుంటుందని తెలుస్తోంది. సోగ్గాడేచిన్నినాయనా మాదిరిగా కాస్త అల్లరి, సరదా వుంటూనే, ఫ్యామిలీ చుట్టూ రివాల్వ్ అయ్యే కధను రవితేజ కోసం సెట్ చేసాడట. అంటే కచ్చితంగా ఏదో డిఫరెంట్ గా చేయబోతున్నాడన్నమాట.

కానీ ఒకటే సమస్య. జనాలు మాత్రం రవితేజ సినిమా అంటే ఇలా వుంటుంది అని ఫిక్సయిపోయారు. అందుకు భిన్నంగా వుంటే పెద్దగా ఇష్టపడరు. సారొచ్చారు అంటూ గతంలో ఇలా డిఫరెంట్ గా చేయబోతే, సినిమాను ఇంటికి పంపేసారు. అందువల్ల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన మార్కు చూపించడం కన్నా, రవితేజ మార్కు వుండేలా చూడడం ముఖ్యం కదా?