బాలయ్య పెట్టించిన ముహుర్తం

సినిమా వాళ్లకు సెంటిమెంట్లు, ముహుర్తాలు ఎక్కువ వుంటాయి. పైగా బాలకృష్ణకు అలాంటివి చాలా ఎక్కువ. ఆయన జ్యోతిష్యం, ముహూర్తం అలాంటివి చాలా గట్టిగా పట్టించుకుంటారు. తన సినిమాలకు సంబంధించి అన్నింటికీ ఆయనే ముహుర్తాలు పెట్టిస్తారు.…

సినిమా వాళ్లకు సెంటిమెంట్లు, ముహుర్తాలు ఎక్కువ వుంటాయి. పైగా బాలకృష్ణకు అలాంటివి చాలా ఎక్కువ. ఆయన జ్యోతిష్యం, ముహూర్తం అలాంటివి చాలా గట్టిగా పట్టించుకుంటారు. తన సినిమాలకు సంబంధించి అన్నింటికీ ఆయనే ముహుర్తాలు పెట్టిస్తారు. అది సినిమా ఓపెనింగ్ అయినా, టీజర్ విడుదలయినా, ట్రయిలర్ అయినా కూడా. సెకెండ్లు, నిమషాలతో సహా చాలా పట్టుదలతో వుంటారు.

లేటెస్ట్ గా ఎన్టీఆర్ బయోపిక్ టీజర్ చిత్రీకరణ కోసం ముహర్తం బాలయ్యే పెట్టించారంట. అయితే కేవలం టీజర్ చిత్రీకరణ కోసం ముహుర్తం పెట్టించారా? లేక టోటల్ గా సినిమా షూట్ దీంతోనే స్టార్టింగ్ నా అన్నది క్లియర్ గా లేదు.

నిజానికి ఇది ముహుర్తాల లెక్కల ప్రకారం శూన్యమాసం. ధనుర్మాసం, నెలగంట పెట్టాక మళ్లీ సంక్రాంతి దాటే వరకు ఏవీ స్టార్ట్ చేయరు. పైగా ఇప్పుడు తెలుగు క్యాలెండర్ ప్రకారం మూఢం నడుస్తోంది. అందుకే ఆ మధ్య చాలా సినిమాలకు వరుసపెట్టి మూఢం స్టార్ట్ కాక ముందే క్లాప్ లు కొట్టించేసారు.

మరి ఇలాంటి టైమ్ లో బాలయ్య తన తండ్రి బయోపిక్ కు శ్రీకారం చుట్టడం ఏమిటో ? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నిర్మాతలకు కూడా నమ్మకాలు వున్నా, ఈ విషయాలు తెలిసినా, బాలయ్య ముహుర్తం పెట్టించారు అంటే అది కచ్చితంగా బాగానే వుండి వుంటుంది అని డిసైడ్ అయి ముందుకు వెళ్లిపోతున్నారు.