మళ్లీ పాట పాడేసిన రచయిత

పాటల రచయితలు పాటలు పాడడం కొత్త కాదు. సాధారణంగా పాటల రచయితలకు ఆ మీటర్ క్లియర్ గా తెలుస్తోంది. పైగా ఎక్కడ తగ్గించాలి. ఎక్కడ పెంచాలి. ఫీల్ ఎలా తీసుకురావాలి అన్నది ఓ క్లియర్…

పాటల రచయితలు పాటలు పాడడం కొత్త కాదు. సాధారణంగా పాటల రచయితలకు ఆ మీటర్ క్లియర్ గా తెలుస్తోంది. పైగా ఎక్కడ తగ్గించాలి. ఎక్కడ పెంచాలి. ఫీల్ ఎలా తీసుకురావాలి అన్నది ఓ క్లియర్ ఐడియా వుంటుంది.

అందుకే పాటలు రాసిన తరువాత స్వర కర్తకు వాళ్ల గొంతుతోటే వినిపిస్తారు. సినారె దగ్గర నుంచి సిరివెన్నెల మీదగా చంద్రబోస్ దాకా అందరికీ ఈ సరదా వుంటుంది.

రచయిత చంద్రబోస్ కు పాటలు పాడడం అంటే సరదా. గతంలో పెళ్లిసందడి, పరదేశి, ప్రేమించుకుందాం రా, మా నాన్నకు పెళ్లి, ఇలాంటి సినిమాల్లో అప్పుడప్పుడు తన గొంతు వినిపించారు. అయితే ఈ మధ్య మళ్లీ గొంతు సవరించుకోలేదు. ఇప్పుడు ఓ సినిమా కోసం చంద్రబోస్ మళ్లీ పాట పాడారు.

మన్యం అనే సినిమాలో చంద్రబోస్ ‘చినుకల్లె కురిసిందే’ అంటూ గాయని అమృత వర్షినితో కలిసి ఓ డ్యూయట్ పాడేసారు. గమ్మత్తేమిటంటే ఈ పాటకు రచయిత మాత్రం చంద్రబోస్ కాదు. ఆ సినిమాకు సంగీతం అందిస్తున్న సదాచంద్రనే పాట కూడా రాసారు. ఎస్ వి రమణ ఈ సినిమాకు దర్శకుడు.