ఏం కాంబినేషన్? ఎంత సైలంట్?

సందీప్ కిషన్ భలే హీరో. సైలెంట్ గా సినిమాలు చేసేస్తుంటాడు. ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియదు. ఫినిషింగ్ కు వచ్చాక బయటకు వస్తుంది. తమన్నా హీరోయిన్ గా సందీప్ కిషన్ ఓ సినిమా చేసేసాడట.…

సందీప్ కిషన్ భలే హీరో. సైలెంట్ గా సినిమాలు చేసేస్తుంటాడు. ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియదు. ఫినిషింగ్ కు వచ్చాక బయటకు వస్తుంది. తమన్నా హీరోయిన్ గా సందీప్ కిషన్ ఓ సినిమా చేసేసాడట. ఈ సినిమా కబుర్లు వింటే భలే గమ్మత్తుగా వుంది. ఆ కాంబినేషన్ అలా వుంది మరి.

నిర్మాత ఎవరో కాదు. తెలుగునాట హీరోగా చేయాలని సదా తపన పడే సచిన్ జోషి. ఇతగాడు  ఇప్పటి దాకా తను హీరోగానే సినిమాలు నిర్మించాడు. ఇప్పుడు తొలిసారి వేరే హీరోతో సినిమా నిర్మిస్తున్నాడు. దాంట్లోనే సందీప్ కిషన్ హీరో. పైగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనుకున్నారు. దాదాపు అందరు హీరోలను చుట్టేసి, లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ తో చేస్తున్న తమన్నా. అంటే తమన్నాకు తెలుగులో ఇప్పుడున్న రెండో సినిమా ఇదన్నమాట.

ఇంకో అట్రాక్షన్ కూడా వుంది ఈ సినిమాకు. అదేంటంటే డైరక్టర్. ఈ సినిమాకు డైరక్టర్ గా పనిచేస్తున్నది కునాల్ కోహ్లి. ఈ బాలీవుడ్ డైరక్టర్ తొలిసారి తెలుగు సినిమా చేస్తున్నాడు. సందీప్ కిషన్-తమన్నా-కునాల్ కొహ్లి-సచిన్ జోషి లాంటి పేర్లు కలిసినా, సినిమాను సైలంట్ గా ఫినిష్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ చకచకా చేసేస్తున్నారు. అయినా పెద్దగా హడావుడి చేయడం లేదు.