సినిమా జనాలు ఓ భ్రమలో వుంటారు. దాని నుంచి బయటకురారు అంత సులువుగా. నాన్ కాంట్రావర్షియల్ గా వుండే నిర్మాత దిల్ రాజు. అలాంటి వ్యక్తిని కూడా వివాదంలోకి లాగిన సినిమా డిజె. ఆ సినిమా కలెక్షన్ల విషయంలో రకరకాల వార్తలు వచ్చాయి. దువ్వాడజగన్నాధమ్ బ్లాక్ బస్టర్ అని అప్పట్లో చాలా హడావుడి చేసారు.
అయితే అంతటి బ్లాక్ బస్టర్ అన్న సినిమాకు బయ్యర్లు లాస్ అయ్యారని, వాళ్లను ఫిదాతో ఆదుకున్నానని ఇటీవల నిర్మాత దిల్ రాజు చెప్పకనే చెప్పేసారు. అంటే బయ్యర్లు డిజె సినిమాతో లాస్ అయ్యారని ఇప్పడు క్లియర్ అయింది. సినిమా వల్ల బయ్యర్లు లాస్ అయ్యారంటే, ఇక ఆ సినిమాను బ్లాక్ బస్టర్ అని ఎలా అంటారు? అనుకుంటారు ?
అయితే ఇంకా బన్నీ అదే భ్రమలో వున్నట్లు కనిపిస్తోంది. నిన్నటికి నిన్న దిల్ రాజు బ్యానర్ సక్సెస్ ఆఫ్ 2017ఫంక్షన్ లో బన్నీ మాట్లాడుతూ, ఒకే ఏడాదిలో అయిదు హిట్ లు, ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన నిర్మాత అన్నాడు.
నిజానికి బ్లాక్ బస్టర్ అంటే మిగిలిన అయిదింటిని అనాలేమో? శతమానంభవతి, ఫిదా రెండూ పక్కా బ్లాక్ బస్టర్లు. నేను లోకల్, ఎంసిఎ మాంచి హిట్ లు. రాజా ది గ్రేట్ బయ్యర్లకు కాస్త లాస్ నే. డిజె సంగతి నిర్మాత దిల్ రాజే చెప్పారు. మరి ఇంకా బ్లాక్ బస్టర్ అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ నో?