స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకపక్క సినిమా చేస్తూనే, మరోపక్క తరువాతి సినిమాకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. వక్కంతం వంశీ డైరక్షన్ లో సినిమా పూర్తి చేసిన వెంటనే మరో సినిమా స్టార్ట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కొత్త దర్శకుడు అనురెడ్డి చెప్పిన బాక్సింగ్ నేఫథ్యపు కథను బన్నీ ఓకె చేసిన సంగతి తెలిసిందే.
అయితే కొత్త దర్శకుడు కథ చెప్పడం, ఒకె. అసలు టేకింగ్ ఎలా వుంటుంది? ఎలా తీయగలడు, ఏ మేరకు తీయగలడు అన్నది తెలుసుకోవాలని అనుకుంటున్నాడట బన్నీ. అందుకోసం ఓ టెస్ట్ షూట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ టెస్ట్ షూట్ లో బన్నీ వుండడు. వేరే కొన్ని సీన్లు ఎలా తీయాలనుకుంటున్నావో, ఏలా తీస్తావో తీసి చూపించు అని బన్నీ ఆ కొత్త డైరక్టర్ కు అన్ని సదుపాయాలు ఇచ్చి పంపినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ఇక బాల్ ఆ కొత్త దర్శకుడి కోర్టులో పడిందన్నమాట. కెమెరామెన్ సహాయంతో విభిన్నంగా సీన్లు తీసి చూపించగలిగితే, బన్నీతో సినిమా అనే జాక్ పాట్ కొట్టేసినట్లే. ఇప్పటికే కథ ఓకె చేయించుకుని ఓ ఎగ్జామ్ పాస్ అయిపోయాడు. ఇప్పుడు సీన్లు డిఫరెంట్ గా తీసి చూపిస్తే, ఫైనల్ ఎగ్జామ్ కూడా పాసై పోతాడన్నమాట.