పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు అజ్ఞాతవాసి ట్రయిలర్ కోసం. ఆడియో ఫంక్షన్ లోనే ట్రయిలర్ రావాలి. కానీ అప్పటికి రెండు రోజుల ముందే టీజర్ ఇచ్చారు. అందువల్ల ట్రయిలర్ ను వెనక్కు నెట్టారు. క్రిస్మస్ కానుకగా ట్రయిలర్ ను విడుదల చేస్తామని అప్పట్లో యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే డవుట్ గా వుంది.
అజ్ఞాతవాసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా జోరుగా సాగుతోంది. డైరక్టర్ త్రివిక్రమ్ ఆ పనిలో బిజీగా వున్నారు. మరోపక్క పవన్ పాడిన మాస్ పాట రికార్డింగ్ పూర్తయింది. దాన్ని జనవరి 1నాటికి విడుదల చేయాలి. అదో పని వుంది. అందువల్ల ట్రయిలర్ ను మరి క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తారా? లేదా? అన్నదాంట్లో ఇంకా క్లారిటీ లేదు. బహుశా రాదేమో అన్న అనుమానాలు కూడా వున్నాయి.
వస్తే క్రిస్మస్ కానుకగా రావాలి. లేదంటే, న్యూ ఇయర్ గిఫ్ట్ గానైనా రావాలి. న్యూ ఇయర్ గిఫ్ట్ గా పవన్ పాడిన పాట వస్తుంది. మరి ఈలోగా ట్రయిలర్ ను వదుల్తారో లేదా వదిలేస్తారో?