నీయమ్మ అన్నది ఎంత తప్పో, నీయబ్బ అన్నదీ అంతే తప్పు. అయితే సినిమాల్లో ఆడ, మగ కూడా నీయబ్బ అనేయడం కామన్. బూతులు కూడా యథేచ్ఛగా, మ్యూట్ చేసి మరీ వాడేస్తున్నారు సినిమాల్లో. అందువల్ల జనం కూడా అలవాటు పడిపోయారు. ఇప్పుడు అందుకే కావచ్చు బాలయ్య ట్రయిలర్ లో కూడా ఈ మాట వినిపించేసింది.
'బొమ్మ తిరగేస్తా నీ…' అని బాలయ్య చాలా పవర్ ఫుల్ గా డైలాగు చెప్పేసారు. బాలయ్య నటించిన 102వ చిత్రం జై సింహా ట్రయిలర్ విడుదలయింది. మాంచి పవర్ ప్యాక్డ్ గా వుంది ట్రయిలర్. బాలయ్య మార్కు డైలాగులు, బాలయ్య మార్కు ఫైట్లు, కేఎస్ రవికుమార్ మార్కు చిన్న స్టయిల్ సీన్లు అన్నీ సెట్ చేసేసారు
ట్రయిలర్ లో. నయనతార అందంగా కనిపించింది. 'నీకు వయసు ఆగిపోతుందేమో, కానీ నాకు వయసు అయిపోతోంది' అని నయనతార డైలాగ్ అయితే చెప్పింది కానీ నిజానికి ఆమె వయసు తగ్గుతోంది అనిపిస్తోంది ట్రయిలర్ లో చూస్తే. రత్నం డైలాగులు ఫవర్ ఫుల్ గానే వున్నాయి. కథ కూడా అలాగే వున్నట్లుంది ట్రయిలర్ చూస్తుంటే.