డిసెంబర్ 31 రాత్రి.. తమన్న ఆటాపాట

న్యూ ఇయర్ వస్తుందంటే చాలు.. డిసెంబర్ 31రాత్రి తారల హంగామాతో హల్ చల్ చేయడానికి రిసార్టులు, పబ్స్ రెడీ అయిపోతాయి. ఇందులో భాగంగా తమన్న కూడా ఓ భారీ డీల్ సెట్ చేసుకుంది. 31…

న్యూ ఇయర్ వస్తుందంటే చాలు.. డిసెంబర్ 31రాత్రి తారల హంగామాతో హల్ చల్ చేయడానికి రిసార్టులు, పబ్స్ రెడీ అయిపోతాయి. ఇందులో భాగంగా తమన్న కూడా ఓ భారీ డీల్ సెట్ చేసుకుంది. 31 రాత్రి ఓ రిసార్ట్ లో డాన్స్ చేసేందుకు భారీ మొత్తం తీసుకుంది మిల్కీ బ్యూటీ

తమన్న ఆడిపాడేది ముంబయిలో కాదు, హైదరాబాద్ లో కూడా కాదు. గుంటూరులోని ఓ రిసార్ట్ లో ఆమె చిందేయనుంది. నిజానికి ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే అన్నింటి కంటే గుంటూరు నుంచి వచ్చిన ఆఫర్ భారీగా ఉండడంతో అటువైపు మొగ్గుచూపించింది.

ఐటెంసాంగ్స్, డాన్స్ షోలు కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే అని గతంలోనే ప్రకటించింది తమన్న. తక్కువ కాల్షీట్లకు ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తుంది కాబట్టే ఐటెంసాంగ్స్ చేస్తున్నానని జై లవకుశ షూటింగ్ టైమ్ లోనే ప్రకటించింది. ఇప్పుడు గుంటూరు రిసార్ట్ లో డాన్స్ కూడా అదే కోవలోకి వస్తుంది.

ప్రస్తుతం తమన్న తెలుగులో 3సినిమాలు చేస్తోంది. క్వీన్ రీమేక్ తో పాటు కల్యాణ్ రామ్, సందీప్ కిషన్ సినిమాల్లో నటిస్తోంది. మరో హిందీ సినిమా, ఓ తమిళ సినిమా విడుదలకు సిద్ధమయ్యాయి.