ఇక్కడ డిజాస్టర్ అయిన సినిమాను తమిళనాట విడుదల చేయడమే పెద్ద సాహసం అనుకుంటే.. మళ్లీ అందులో రీ-ఎడిటింగ్స్ కూడా చేస్తున్నారట. తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మార్పులు చేస్తున్నారట. మహేష్ నటించిన బ్రహ్మోత్సవం సినిమాకు సంబంధించి ఇలా ఎన్నో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి.
ఈ సినిమాను అనిరుధ్ పేరుతో త్వరలోనే కోలీవుడ్ లో విడుదల చేయబోతున్నారు. సమంత, కాజల్ కలిసి నటించిన సినిమా కావడంతో మూవీకి కాస్త క్రేజ్ రావొచ్చని భావిస్తున్నారు. అందుకే ఇక్కడ ఫ్లాప్ అయినా తమిళ్ లో విడుదల చేసేంత సాహసం చేస్తున్నారు. ఇప్పుడీ మూవీని తమిళ అభిరుచికి తగ్గట్టు మార్చడానికి నానా తంటాలు పడుతున్నారట మేకర్స్.
ఇందులో భాగంగా దాదాపు 29నిమిషాల సన్నివేశాలు తొలిగించారట. పాటల ప్లేస్ మెంట్ మార్చారట. తమిళనాట ఈ సినిమా ప్రమోషన్ కూడా మొదలైంది. పోస్టర్లు, ట్రయిలర్లలో మహేష్ కంటే కాజల్, సమంతానే ఎక్కువగా కనిపిస్తున్నారు. అక్కడక్కడ సత్యరాజ్ ను కూడా చూపిస్తున్నారు. అంటే మహేష్ కాకుండా, కేవలం వీళ్ల ముగ్గురిపైనే తమిళ నిర్మాత ఆశలు పెట్టుకున్నాడన్నమాట.