సుకుమార్ పై నాగ్ కన్ను?

హీరో నాగార్జున నిర్మాత కూడా. పైగా ఇద్దరు హీరోల తండ్రి. అందువల్ల పిల్లలకు సరైన లైనప్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తనకు హిట్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ తో ఓ సినిమాను చైతన్య…

హీరో నాగార్జున నిర్మాత కూడా. పైగా ఇద్దరు హీరోల తండ్రి. అందువల్ల పిల్లలకు సరైన లైనప్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తనకు హిట్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ తో ఓ సినిమాను చైతన్య కోసం చేయించాడు. అలాగే తమ బ్యానర్ కు మెమరబుల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె కుమార్ తో అఖిల్ కు ఓ సినిమా చేయించాడు. చైతన్య కెరీర్ గాడిలో పడింది. చందు మొండేటితో ఒకటి, మారుతితో మరొకటి రెండు సినిమాలు చేస్తున్నాడు. 

అఖిల్ ఇప్పుడే ఓ సినిమా ఫినిష్ చేసాడు. తరువాత ఏమిటీ? అందుకే మళ్లీ నాగ్ గాలింపు మొదలైందట. ఇప్పుడు ఎవరు ఖాళీగా వున్నారు? ఖాళీ కాబోతున్నారు? అని చూస్తున్నాడట. ప్రస్తుతానికి సమీప భవిష్యత్ లో కొరటాలశివ, సుకుమార్ రెడీ కాబోతున్నారు. అయితే కొరటాలశివ విషయంలో క్లారిటీ రావడం లేదు.

రామ్ చరణ్ తో సినిమా ఎప్పుడు చేస్తాడో తెలియదు. బన్నీ క్యాంప్ కొరటాలశివ కొసం ట్రయ్ చేస్తోందని వినిపిస్తోంది. ప్రభాస్ కూడా కొరటాలతో సినిమా చేసే ఆలోచనలో వున్నారని వినిపిస్తోంది. వీటిపై క్లారిటీ రాగానే నాగ్ కూడా కొరటాలను కాంట్రాక్ట్ చేస్తారని వినికిడి.

అలాగే రంగస్థలం రిజల్ట్ చూసి సుకుమార్ తో ఓ సినిమా చేయించే ఆలోచన కూడా నాగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే సుకుమార్ కు కమిట్ మెంట్ ఏమీ వున్నట్లు లేదు. అందువల్ల అఖిల్ తో సుకుమార్ సినిమా అయితే బాగుంటుందనే ఆలోచన కూడా నాగ్ క్యాంప్ చేస్తోందని వినికిడి.