జాగ్రత్త పడ్డ దర్శకుడు

తొలి సినిమా టైగర్ తో ఫరవాలేదు విషయం ఉంది అనిపించుకున్నాడుదర్శకుడు ఆనంద్. ఎక్కడికి పోతావు చిన్నవాడా సబ్జెక్ట్ పట్టుకుని చాలా మందిని ట్రై చేస్తే ఆఖరికి నిఖిల్ ఛాన్స్ ఇచ్చాడు. Advertisement ఆ సినిమా…

తొలి సినిమా టైగర్ తో ఫరవాలేదు విషయం ఉంది అనిపించుకున్నాడుదర్శకుడు ఆనంద్. ఎక్కడికి పోతావు చిన్నవాడా సబ్జెక్ట్ పట్టుకుని చాలా మందిని ట్రై చేస్తే ఆఖరికి నిఖిల్ ఛాన్స్ ఇచ్చాడు.

ఆ సినిమా కాస్త ఓవర్ బడ్జెట్ కావడం, నిర్మాత క్లైమాక్స్ టైంకు చేతులు ఎత్తడం, ఫారిన్ లో తీయాల్సిన క్లైమాక్స్ ను పంట చేలల్లోతీయడం వంటివి జరిగాయి. మొత్తానికి ఆ సినిమా గట్టెక్కింది. దాదాపు 20కోట్లు వసూలు చేయడంతో, ఆనంద్ కు మాంచిపేరు వచ్చింది. అయినా కూడా పెద్ద హీరో లతో ఛాన్స్ ఏమి రాలేదు. అల్లు శిరీష్ తో సరిపెట్టు కోవాల్సి వచ్చింది. 

ఒక్క క్షణం సినిమా కథ కాపీ అని, విదేశీ సినిమా నుంచి ఫ్రీగా ఎత్తుకు వచ్చేసింది అని వార్తలు గుప్పుమన్నాయి. గుప్పు మనడమే కాదు, అసలు ఒక్క క్షణం సినిమా విడుదలకే అడ్డం పడే పరిస్థితి కనిపించింది. నిజానికి ఒక్క క్షణం మాతృక ఏదయితే ఉందొ ఆ సినిమా పేరు ఇతరత్రా వ్యవహారాలు అన్నీ దర్శకుడు ఆనంద్ కు ముందే తెలుసట.

ఎకె ఎంటర్టైన్మెంట్ సంస్థ, ఆనంద్ మొదట్లో ఇదిగో వస్తా, అదిగో వస్తా అంటూ కాలయాపన చేసారట. సినిమా దాదాపు పూర్తి అయ్యాక, ఆబ్బె ఆ సినిమాకు నా సినిమాకు సంబంధం లేదన్నారట. ఆఖరికి ఎకెకు ఓ సినిమా చేస్తానని ఆనంద్ ఒప్పుకోవడంతో ఆ కథ సుఖాంతం అయింది. అయినా కాపీ మచ్చ అలాగే వుంది. 

అందుకే ఇప్పుడు ట్రయిలర్ లో దర్శకుడు ఆనంద్ జాగ్రత్తపడినట్లు క్లియర్ గా తెలుస్తోంది. సినిమాకు థ్రిల్లర్ లుక్ పూర్తిగా రాకుండా కాస్త ఫన్ లుక్ తీసుకువచ్చాడు. థ్రిల్లర్ పాలు తగ్గించడానికి కారణం పారలల్ లైఫ్ సినిమా గుర్తు చేయకుండా వుండడం కొసమే అనుకోవాలి. మొత్తం మీద దర్శకుడు జాగ్రత్త పడ్డాడు.

ట్రయిలర్ తొలిసగం అంతా శిరీష్ మీద ఫన్ ట్రాక్ రన్ చేసాడు. మలి సగంలో కూడా థ్రిల్లర్ లుక్ కాస్త మాత్రమే సెట్ చేసి, అవసరాలను సీన్ లోకి తీసుకువచ్చాడు ఆ విధంగా కాపీ మచ్చను చెరిపే జాగ్రత్త పడ్డాడు దర్ళకుడు ఆనంద్.