రిపోర్టర్ గా త్రివిక్రమ్ ?

డైరక్టర్ త్రివిక్రమ్ రిపోర్టర్ అవతారం ఎత్తారు. అజ్ఞాతవాసి సినిమా ప్రచారం కోసం కావచ్చు. లేదా పాటల రచయిత సిరివెన్నెల మీద వున్న అభిమానం, గౌరవం వల్ల కావచ్చు. తానే స్వయంగా సిరివెన్నెల సీతారామశాస్త్రిని ఇంటర్వూ…

డైరక్టర్ త్రివిక్రమ్ రిపోర్టర్ అవతారం ఎత్తారు. అజ్ఞాతవాసి సినిమా ప్రచారం కోసం కావచ్చు. లేదా పాటల రచయిత సిరివెన్నెల మీద వున్న అభిమానం, గౌరవం వల్ల కావచ్చు. తానే స్వయంగా సిరివెన్నెల సీతారామశాస్త్రిని ఇంటర్వూ చేసారని తెెలిసింది.

సిరివెన్నెల అంటే త్రివిక్రమ్ కు మాంచి గౌరవం వుంది. అంతకు మించి బంధుత్వం కూడా వుంది. అయితే ఇటీవల సిరివెన్నెల పాటలేవీ త్రివిక్రమ్ సినిమాకు రాయలేదు. చాలా కాలం తరువాత అజ్ఞాతవాసి సినిమాలో ఓ పాట రాసారు.

గాలువాలుగా… అంటూ రాసిన ఈ పాట ఇప్పుడు ఆ సినిమా ఆల్బమ్ కే హైలైట్ అవుతోంది. అజ్ఞాతవాసికి డిఫరెంట్ గా ప్రచారం చేయాలని ఆలోచిస్తున్నారు డైరక్టర్ త్రివిక్రమ్. రొటీన్ ఇంటర్వూలు, రొటీన్ చిట్ చాట్ లు కాకుండా, ఇంకేదైనా కాస్త ఓ స్థాయి వుండాలనుకుంటున్నారు.

అందులో భాగంగానే సిరివెన్నెలతో త్రివిక్రమ్ ఇంటర్వూ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే అజ్ఞాతవాసి సినిమా ప్రమోషన్ కోసం త్రివిక్రమ్ రిపోర్టర్ అవతారం ఎత్తి సిరివెన్నెలను ఇంటర్వూ చేస్తారన్న మాట. 

ఇద్దరు మేధావి వర్గ ప్రముఖులు ముచ్చటించడం అంటే కచ్చితంగా అది ఓ స్థాయిలో వుంటుంది. కచ్చితంగా యూ ట్యూబ్ లో ఊపు ఊపేస్తుంది. అవును, పనిలో పనిగా హీరో పవన్ ను కూడా త్రివిక్రమ్ ఇంటర్వూ చేస్తే ఏలా వుంటుందో?