వైకాపా మీదకు మళ్లిన వర్మ తుఫాను

మొత్తం మీద రామ్ గోపాలాస్త్రం రూట్  మళ్లించుకున్నట్లు తెలుస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల మీద ఫోకస్ పెడతాడు అనుకుంటే, కడప అంటూ ఇప్పుడు వైకాపా వ్యవహారాల మీద దృష్టి పెడుతున్నట్లు…

మొత్తం మీద రామ్ గోపాలాస్త్రం రూట్  మళ్లించుకున్నట్లు తెలుస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల మీద ఫోకస్ పెడతాడు అనుకుంటే, కడప అంటూ ఇప్పుడు వైకాపా వ్యవహారాల మీద దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తాత్కాలికంగానో, శాశ్వతంగానో పక్కకు పోయినట్లు కనిపిస్తోంది. నాగ్-వర్మ సినిమా షూట్ స్టార్ట్ అయింది.

ఇలాంటి టైమ్ లో కడప అంటూ వెబ్ సిరీస్ అనౌన్స్ చేసాడు రామ్ గోపాల్ వర్మ ఆల్ ఆఫ్ ది సడెన్ గా… “వెండితెర మీద నన్ను నా ఇష్టం వచ్చినట్టు చెప్పనివ్వని కథల్ని ఎవడినీ కేర్ చెయ్యకుండా చెప్పడం కోసం….” ఇలా ప్రకటించడంతోనే వర్మ సెన్సారుకు దూరంగా సినిమాను అందిస్తానని చెబుతున్నట్లు తెలుస్తోంది.

మరో విషయం కూడా వర్మ చెప్పకనే చెప్పారు..”రక్తచరిత్రలో అసలు నిజాలని చాలా పైపైన చూపించాను. లోలోపలి పూర్తి నిజాలు అప్పటికి నాకు తెలియకపోవడం, కొన్ని వార్ణింగులు ఇచ్చి పుచ్చుకోవడం లాంటి ఇతరితరా కారణాల వల్ల అసలు రాయలసీమ శరీరాన్ని పూర్తిగా బట్టలిప్పదీసి చూపించలేకపోయాను… “అని అన్నారు. అంటే అప్పట్లో బెదిరింపులకు లొంగారన్నమాట. ఇప్పుడు లొంగకుండా ఆయనకు నచ్చినవి, ఆయనకు తెలిసినవి చెబుతారన్నమాట.

మొత్తానికి తెలుగదేశం పార్టీ మీదకు వస్తుందనుకున్న వర్మ తుపాను, వైకాపా మీదకు మళ్లినట్లే వుంది.