యంగ్ హీరోలతో సీనియర్ హీరో పోటీ

పోస్ట్ సంక్రాంతి టైమ్ కూడా టాలీవుడ్ లో రంజుగా మారుతోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో పోటా పోటీగా సినిమాలు పడుతున్నాయి. ఫిబ్రవరి 2న విడుదలకు నాగశౌర్య ఛలో సినిమా రెడీ అవుతోంది. ఈ…

పోస్ట్ సంక్రాంతి టైమ్ కూడా టాలీవుడ్ లో రంజుగా మారుతోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో పోటా పోటీగా సినిమాలు పడుతున్నాయి. ఫిబ్రవరి 2న విడుదలకు నాగశౌర్య ఛలో సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమా మీద కాస్త ఆసక్తి వుంది ఇండస్ట్రీలో. త్రివిక్రమ్ శిష్యుడు దర్శకత్వం వహించడం ఓ కారణం. ఆ తరువాత 9న రెండు సినిమాలు ఇప్పటికే డేట్ లు ఇచ్చాయి. బోగవిల్లి ప్రసాద్ నిర్మించే తొలిప్రేమ సినిమా డేట్ ఫ్రకటించారు. దీన్ని దిల్ రాజు టేకప్ చేసారు. వరణ్ తేజ హీరో ఈ సినిమాలో.

ఇక నిఖిల్-ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ కిర్రాక్ పార్టీ కూడా 9నే విడుదల అని ప్రకటించారు. ఈ సినిమా మీద కూడా మాంచి అంచనాలు వున్నాయి. కన్నడంలో హిట్ అయిన సినిమా ఆధారంగా చందు మొండేటి, సుధీర్ వర్మ బ్యాకెండ్ లో వుంది అందిస్తున్న సినిమా ఇది.

వాస్తవానికి అదే డేట్ కు బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ కాంబినేషన్ లోని సాక్ష్యం సినిమా కూడా వుండాలి. కానీ వర్క్ ఫినిష్ కాకపోవడంతో, దాన్ని మార్చి ఎండింగ్ లేదా ఏప్రిల్ కు వాయిదా వేసారు.

ఇప్పుడు లేటెస్ట్ గా ఇదే డేట్ కు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, విష్ణు నటించిన గాయత్రి సినిమాను కూడా ప్రకటించారు. చాలా కాలం తరువాత మోహన్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో అల్లుకున్న కథ అని తెలుస్తోంది. ఇదే సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో విష్ణు శ్రియ కనిపిస్తారు.

అంటే యంగ్ హీరోలు నిఖిల్, వరుణ్ తేజ వంటి వాళ్లతో సీనియర్ హీరో మోహన్ బాబు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారన్నమాట.