20న హలో ప్రీరిలీజ్ ఈవెంట్?

మొన్నటికి మొన్న విశాఖలో భారీగా ఆడియో ఫంక్షన్ చేసుకుని వచ్చింది అఖిల్ హలో టీమ్. నాగార్జున వీర హల్ చల్ చేసాడు విశాఖలో. అయిదు నుంచి 19వరకు ప్రపంచ తెలుగు మహాసభలు వుండడంతో హైదరాబాద్…

మొన్నటికి మొన్న విశాఖలో భారీగా ఆడియో ఫంక్షన్ చేసుకుని వచ్చింది అఖిల్ హలో టీమ్. నాగార్జున వీర హల్ చల్ చేసాడు విశాఖలో. అయిదు నుంచి 19వరకు ప్రపంచ తెలుగు మహాసభలు వుండడంతో హైదరాబాద్ లో ఏ విధమైన భారీ సినిమా ఫంక్షన్ లకు అనుమతి నో అని ముందే చెప్పేసారు భాగ్యనగర్ పోలీసులు. అందుకే విశాఖకు వెళ్లారు. బాగానే ఫంక్షన్ చేసారు. అలా అని హైదరాబాద్ లో ఫంక్షన్ లేకుంటే ఎలా?

అందుకే 20న కానీ, ఆ మర్నాడు కానీ హైదరాబాద్ లో అఖిల్ హలో సినిమా ప్రీ రిలీజ్ సక్సెస్ మీట్ చేయాలని అనుకుంటున్నారట. అయితే ప్రస్తుతం అఖిల్ ఓవర్ సీస్ టూర్ లో వున్నాడు. 19కి ఇక్కడికి వచ్చేస్తే 20న ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చేయాలని అనుకుంటున్నారట. అక్కినేని ఫ్యామిలీ మొత్తం, అలాగే నాగ్ సన్నిహితులు, ఇంకా పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించే దిశగా డిస్కషన్లు సాగుతున్నాయి.

19న ప్రీరిలీజ్ ఫంక్షన్ అయిపోతే, అక్కడికి జస్ట్ రెండు రోజుల్లోనే సినిమా స్క్రీన్ పైకి వస్తుంది. హలో సినిమా విషయమైన నాగ్ చాలా కీలకంగా వున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాకు తమ వంతు బజ్ తెచ్చే పని వన్ పర్సంట్ కూడా తగ్గకూడదని ఫిక్సయిపోయారు. ఆ రూట్లో వెళ్తున్నారు. ఆపైన విక్రమ్ కుమార్ అందించే సినిమా మీద ఆధారపడి వుంటుంది ఫలితం. ఇప్పటికి అయితే ఆ వారం విడుదలయ్యే ఎంసిఎ, హలో సినిమాలు రెండింటిలో బజ్ అయితే దీనికే వుంది పూర్తిగా.