2018 సంక్రాంతి చాలా హట్ అని ముందు నుంచీ వార్తలు వినిపించాయి. అయితే మెల్లగా రేస్ లోంచి ఒక్కో సినిమా తప్పకుంటున్నాయి. బాలయ్య-కెఎస్ రవికుమార్ సినిమా పక్కాగా వస్తోంది. యువి క్రియేషన్స్ భాగమతి అనుకున్నారు కానీ ముందుగానే వారం వెనక్కు వెళ్లింది. దాని ప్లేస్ లో సూర్య సినిమా గ్యాంగ్ విడుదలవుతోంది.
విశాల్ అభిమన్యుడు సంక్రాంతి రేస్ లో వుంటుందనుకున్నారు. కానీ అది కూడా వారం వెనక్కు వెళ్లిపోయింది. రవితేజ టచ్ చేసి చూడు విడుదలవుతుందనుకున్నారు కానీ అది వెనక్కు వెళ్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఆ మధ్య టచ్ చేసి చూడు రఫ్ చూసారని, ఏస్ డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ కాస్త రీషూట్ లు చెప్పారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఆ సినిమా కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.
అంటే ఇప్పటికి సంక్రాంతికి పవన్ అజ్ఞాతవాసి, బాలయ్య జై సింహా, సూర్య గ్యాంగ్ పక్కాగా ఫిక్స్ అయ్యాయి. ఇక రాజ్ తరుణ్ చిన్న సినిమా రంగులరాట్నం కూడా వుండే అవకాశం వుందని తెలుస్తోంది. కానీ పోస్ట్ సమ్మర్ మాత్రం ఫుల్ పోటాపోటీగా వుండే అవకాశం వుంది.
జనవరి 26, ఫిబ్రవరి 2, 9 తేదీల్లో ఒక్కోవారం కనీసం మూడు మీడియం సినిమాలు వుండే అవకాశం వుంది. అనుష్క భాగమతి, వరుణ్ తేజ తొలిప్రేమ, నిఖిల్ కిర్రాక్ పార్టీ, నాగశౌర్య ఛలో, విశాల్ అభిమన్యుడు డేట్లు ప్రకటించాయి. రేపు, ఎల్లుండిలో మరో ఒకటి రెండు సినిమాలు ఇదే డేట్లలో రిలీజ్ ప్రకటించే అవకాశం వుంది.