వెంకటేష్ ఓ సినిమా చేస్తున్నాడంటే అందులో సురేష్ బాబు ప్రమేయం తప్పనిసరి. తను నిర్మాతగా ఉంటూ, మరో వ్యక్తిని కో-ప్రొడ్యూసర్ గా పెట్టి సినిమాలు చేస్తుంటాడు. లేదంటే తెరవెనక నుంచి పర్యవేక్షణైనా ఉంటుంది. కానీ ఈసారి సురేష్ బాబు ప్రమేయం లేకుండానే వస్తోంది వెంకీ సినిమా. అదే త్రివిక్రమ్-వెంకీ మూవీ.
ఈ మూవీకి సంబంధించి ఈసారి అన్నీ హారిక-హాసిని క్రియేషన్స్ చూసుకుంటుంది. ఆ సంస్థను త్రివిక్రమ్ చూసుకుంటారు. అంతే.. అంతకుమించి మరొకరి ప్రమేయం ఉండబోదు. చివరికి సినిమా రిలీజ్ విషయంలో కూడా సొంతంగానే వెళ్లాలని నిర్ణయించుకున్నారు నిర్మాత రాధాకృష్ణ.
వెంకీ-త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఎవరికైనా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు గుర్తొస్తాయి. ఈసారి కూడా అలాంటిదే ఓ హిలేరియస్ మూవీ ఎక్స్ పెక్ట్ చేస్తారు ఎవరైనా. ఈ విషయంలో కూడా గత సినిమాలతో “నో కనెక్షన్” అని తెలుస్తోంది. కంప్లీట్ కామెడీ జానర్ నుంచి ఎప్పుడో పక్కకొచ్చేసిన త్రివిక్రమ్, ఈసారి వెంకీని సరికొత్తగా చూపించబోతున్నాడట. నిజానికి ఇదొక మల్టీస్టారర్ అనే ప్రచారం కూడా సాగుతోంది.
అజ్ఞాతవాసి సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడు త్రివిక్రమ్. ఆ మూవీ తర్వాత వెంకీతో సినిమా స్టార్ట్ అవుతుంది.