ఇద్దరమ్మాయిలు సినిమా టైమ్ లో బన్నీకి క్యాథరీన్ తెగ నచ్చేసింది. ఆమె అందం, పెర్ఫార్మెన్స్ ను పొగడకుండా ఉండలేకపోయాడు. ఆ సినిమా తర్వాత బన్నీనే స్వయంగా రికమండ్ చేసి మరీ క్యాథరీన్ కు కొన్ని అవకాశాలిప్పించాడంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఆ రేంజ్ లో అను ఎమ్మాన్యుయేల్ నచ్చిందట అల్లు అర్జున్ కి.
ప్రస్తుతం వీళ్లిద్దరూ కలిసి 'నా పేరు సూర్య' అనే సినిమా చేస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అను యాక్టింగ్, నడవడిక బన్నీకి బాగా నచ్చాయట. అందుకే ఆమెను మిగతా హీరోల సినిమాలకు కూడా సిఫార్స్ చేస్తున్నాడట.
ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి రైజింగ్ లో ఉంది అను ఎమ్మాన్యుయేల్. పవన్, బన్నీతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. రామ్ చరణ్, నాగచైతన్య నెక్ట్స్ సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంది. ఈ జోరుకు బన్నీ రిఫరెన్స్ కూడా తోడైతే అను ఎమ్మాన్యుయేల్ టాప్ లీగ్ లోకి దూసుకెళ్లడానికి పెద్దగా టైమ్ పట్టదు.